Friday, November 26, 2010

Orange - Directed By - RGV - Posani - Shekar Kammula - B.Gopal

Orange - Directed By - RGV - Posani - Shekar Kammula - B.Gopal

http://www.youtube.com/watch?v=_We9QIIICzQ&feature=player_embedded#!


Saturday, August 28, 2010

21 రోజుల YSR మాలట!! విగ్రహం కూలినా సంకల్పం చెదరదట..

వార్తల్లో చాలా మంది చూసే ఉంటారు. మనసు లో అభిమానం, ఆత్మీయత వ్యక్తపరచటానికి పాపం గాజువాక లో ఒక వై యెస్ గారి యువజన అభిమానులు అన్నిటికన్నా ఎత్తైన 60 అడుగుల విగ్రహం ప్రతిష్టించాలన్న సంకల్పంట. బెంగాల్ నుండి 11 మంది కళాకారులని తెప్పించారు.. 3 నెలలుగా కష్టపడుతున్నారు.

హ్మ్మ్ బానే ఉంది. తర్వాత పార్టే.. కాస్త "డిఫరెంట్' గా అనిపిస్తుంది సెప్టెంబర్ రెండున దాన్ని ఆవిష్కరించి 21 రోజుల వై యెస్ మాల వేసుకోవటం ఏమిటో, కొబ్బరికాయలు కొట్టి, పూజలు నిష్టగా ఒక దేవుడికి చేసినట్టు చేసి.. నిమజ్జనం చేయటం, ఆ నిమజ్జనం తర్వాత మట్టి ని వెలికి తీసి ఇడుపుల పాయలో వెద జల్లటం..

వారి భక్తి పాపం అలా ఉండగా.. విగ్రహం కూలగానే మనస్తాపాన్ని తట్టుకోలేక ఆ ఆర్గనైజర్ రెండు సెల్ ఫోన్లూ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారుట.. తల్లి దండ్రులకి కూడా తెలియదట..

ఏంటో పాపం!

వివరాలకి

http://www.youtube.com/watch?v=gfEkMcz95Fc

Saturday, August 7, 2010

మన నాయకులు , వారి పండగల/ఇతర సందర్భాల గెటప్ లూ

పూర్వం ఇఫ్తార్ విందుల్లాంటి పార్టీల్లో మన రాజకీయ నాయకులు ఏదో టోపీ పెట్టుకుని ముస్లింల సాంప్రదాయం ప్రకారం, ప్రార్థన చేసిన ఫొటోలు పేపర్లలో వచ్చేవి. అలాగే హిందువుల ఫంక్షన్లకి వచ్చే నాయకులు హిందూ సాంప్రదాయం ప్రకారం ముఖాన కుంకుమ తో కనిపించేవారు టీ వీ ల్లో. వీరంతా పెద్దగా సందర్భానుసారం మేకప్ అవీ చేసుకునే పద్ధతి అవీ లేవు.



అన్నగారు ఎంతైనా కాస్త గ్లామర్ తెచ్చి వివేకానంద గెటప్, వ్యవసాయదారుని గెటప్, ముస్లిం ల షేర్వానీ గెటప్ లాంటివి వేసి రాజకీయాలకి గ్లామర్ టచ్ ఇచ్చి ప్రజల్ని డైలాగులతో రంజింపచేసారు కదా..


ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ గ్లామర్ ఎలక్షన్లకి మాత్రమే పరిమితి అయ్యిందేమో..
మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాల్సిన బాధ్యత 'మార్పు ' అన్న నినాదం తో వచ్చిన మెగా స్టార్ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు కదా.. ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందు లో మరీ అరబ్ షేక్ అవతారమెత్తి కళ్ళకి సుర్మా దగ్గర్నించీ అతి జాగ్రత్త గా అత్యంత సహజం గా కనిపించేలా తగు జాగ్రత్తలు తీసుకుని.. ప్రేక్షక లోకానికి.. సారీ సారీ ప్రజానీకానికి కనువిందు కలిగిస్తే..



మన రోశయ్య గారు నేనూ తక్కువతినలేదని..చూడండి ఎంత చక్కగా గెటప్ మార్చి మేకప్ చేసుకున్నారో ఒక పుస్తకావిష్కారానికి :-)






Monday, August 2, 2010

పిల్లల న్యూస్ లో పెళ్ళిళ్ళూ, గృహ హింస, బిపాషా, రణబీర్ వార్తలు!!


టైంస్ ఆఫ్ ఇండియా వారి స్టూడెంట్స్ ఎడిషన్ చూసి తీరాలి. మా అపార్ట్ మెంట్ లో పాప చేతిలో చూశాను. వాళ్ళ స్కూల్ లో బలవంతం గా అందరిదగ్గర నుంచీ సంవత్సరానికి చందా కట్టించుకున్నారట.
ఏం ఉంటుందో చూద్దాం అని సరదాగా అడిగి తీసుకున్నాను.

మొదటి పేజీ..
ఎడమ పక్క అమీర్ ఖాన్ 8 నెలల నుండీ సినిమాలు చేయట్లేదని కుడి పక్క రాహుల్ మహాజన్ పెళ్ళాన్ని కొట్టాడని వాళ్ళావిడ ఫొటో..
సగం పేజీలో క్లింటన్ల పాప చెల్సియా పెళ్ళి విశేషాలు..కింద పావు పేజీ లో ధోనీ దంపతులు తాజ్ సముద్ర కి వెళ్తే.. అక్కడ వాళ్ళావిడ షెఫ్ ని అడిగి ఆవిడే వండిందిట ఆ వార్త.

రెండవ పేజీ:కింద సగం పేపర్ రాహుల్-డింపి దంపతుల తగాదా, మళ్ళీ కలిసిపోవటం.., చెల్సియా పెళ్ళి విశేషాలు.
మూడవ పేజీ వదిలేస్తే..నాలుగవ పేజీ పూర్తిగా చెల్సియా పెళ్ళి ఫొటోలు, పెళ్ళి గౌను, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారో.. పూర్తిగా డెడికేట్ చేశారు!

ఆఖరి పేజీ లో పావు భాగం..బిపాషా కారీర్ లో పదేళ్ళ పూర్తి, రణబీర్ గిటార్ వాయించటం గురించి, కాజోల్ మళ్ళీ భర్తతో ప్రేమలో పడిందిట

మిగిలిన పేజీలు ఓకే..
ఇవీ ఐదవ తరగతి చదివే పాప కి స్కూల్ వాళ్ళు కొనిపించి ఇచ్చిన దినపత్రిక లో విశేషాలు..

Wednesday, June 30, 2010

మాజీ ప్రధాని పై ఇంత నిర్లక్ష్యమా?

ఈ టైటిల్ తో ఒక వార్త ఈనాడు పత్రిక లో వచ్చింది ఈరోజు.

మాజీ ప్రధాని పీ వీ నరసిం హారావు 90 వ జయంతి ని కాంగ్రెస్ నేతలు ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారట బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు.. ఆయన జయంతి లో కాంగ్రెస్ ఎం ఎల్ యే లూ, ఎం పీ లూ ఎవరూ పాల్గొనక పోవటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

అంటే.. మాజీ/ప్రస్థుత ప్రధాని,అధ్యక్షుల జయంతి ఉత్సవాలు ప్రతి యేటా ఎం ఎల్ యేలూ, ఎం పీ లూ జరపాలా?
దాదాపు ముప్ఫై మంది పుట్టినరోజులు జరుపుతూ ఉంటే ఇంక వేరే పనులేం చేస్తారు?
వారి సంగతి వదిలేస్తే..

మొన్నీ మధ్య రాహుల్ గాంధీ పుట్టినరోజు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు... కానీ ముఖ్యమంత్రి రోశయ్య గారు కూడా రాహుల్ ఫొటో కి కేక్ తినిపించటం కాస్త ఎబ్బెట్టు గా అనిపించలేదూ?

Tuesday, June 29, 2010

చందమామ పువ్వులనెప్పుడైనా చూశారా?




ఎవరో నాకీ విత్తనాలిస్తే ఏవోలే అని వేశాను. నెల తర్వాత.. ప్రతిరోజూ ఒక అద్భుతం నా ఫ్రంట్ యార్డ్ లో..

సాయంత్రం 4.30-5.00 గంటల మధ్య చందమామ పలకరించగానే విరిసి, తెల్లవారేసమయానికి ముడుచుకునే పూలివి...

నెలరాజునలరించటానికే వీటి జన్మ, ఆయన కి వీడ్కోలు చెప్పే ముందే ఎడబాటుని తట్టుకోలేము, అన్నట్టు ముందు గానే నిష్క్రమిస్తాయి..



కలువ పూల మొగ్గ లా ఒక మెగా సైజ్ సన్నజాజి లా సుకుమారం గా ఉంటాయి మొగ్గలు. మనం దాని వైపు చూస్తూ ఉండగానే.. 'ఠప్ప్ ' మని అరచేతి పరిమాణం లో విచ్చుకుంటాయి. ఈ విన్యాసం జరగేది జస్ట్ .. అర సెకన్ వ్యవథి లో.. తెల్లవారాక దాని అవశేషం తప్ప ఏదీ ఉండదు చూట్టానికి..




Thursday, June 24, 2010

అజ్ఞాత, శరత్ 'కాలం', మాలిక నిర్వాహకులు ఏకలింగం గారూ,

అజ్ఞాత,
తెలుగు బ్లాగు మొదలు పెట్టిన 15 రోజులకే కామెంట్ మోడరేషన్ అవసరాన్ని అర్థమయేలా.. కామెంట్లు విడిచినందుకు!

శరత్ 'కాలం' గారికి,
మీ టపా చూసిన తర్వాతే నా బ్లాగ్ కామెంట్లు చూశాను. వెంటనే పోస్ట్ తొలగించాను.. కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేసి మళ్ళీ ప్రచురించాను.
మీ టపా కీ, టపా లో చూపించన సపోర్ట్ కీ కృతజ్ఞతలు.

మాలిక నిర్వాహకులకి,
ప్రత్యేక ధన్యవాదాలు! కామెంట్లు తొలగించినందుకు!