Wednesday, June 30, 2010

మాజీ ప్రధాని పై ఇంత నిర్లక్ష్యమా?

ఈ టైటిల్ తో ఒక వార్త ఈనాడు పత్రిక లో వచ్చింది ఈరోజు.

మాజీ ప్రధాని పీ వీ నరసిం హారావు 90 వ జయంతి ని కాంగ్రెస్ నేతలు ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారట బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు.. ఆయన జయంతి లో కాంగ్రెస్ ఎం ఎల్ యే లూ, ఎం పీ లూ ఎవరూ పాల్గొనక పోవటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

అంటే.. మాజీ/ప్రస్థుత ప్రధాని,అధ్యక్షుల జయంతి ఉత్సవాలు ప్రతి యేటా ఎం ఎల్ యేలూ, ఎం పీ లూ జరపాలా?
దాదాపు ముప్ఫై మంది పుట్టినరోజులు జరుపుతూ ఉంటే ఇంక వేరే పనులేం చేస్తారు?
వారి సంగతి వదిలేస్తే..

మొన్నీ మధ్య రాహుల్ గాంధీ పుట్టినరోజు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు... కానీ ముఖ్యమంత్రి రోశయ్య గారు కూడా రాహుల్ ఫొటో కి కేక్ తినిపించటం కాస్త ఎబ్బెట్టు గా అనిపించలేదూ?

4 comments:

  1. Nice point to ponder. Yeah CM's participation in Rahul's proxy birthday ceremony was not in good taste.

    ReplyDelete
  2. రాజకీయాలని విధానాల మీద కాకుండా, వ్యక్తుల చుట్టూ తిప్పితే జరిగేవి ఇలాంటివే. The way you have clubbed all these examples in a simple post is commendable.

    ReplyDelete
  3. మంచి పాయింట్. కాని,

    "దాదాపు ముప్ఫై మంది పుట్టినరోజులు జరుపుతూ ఉంటే ఇంక వేరే పనులేం చేస్తారు?"

    ఆంటే, వాళ్ళు, ఆ రోజు పి.వి జయంతి జరపకుండా, పనులు చేసేసారని మే ఉద్దేశ్యమా?

    ReplyDelete
  4. @yab,Weekend Politician,

    Yes. May be we can club the birthdays of all leaders and celebrate on one day (Like US)..
    60+ year old chief minister feeding cake to an MP's picture is definitely weird..

    @Ram,

    నిజమే లెండి.. జస్ట్ ఆశించవచ్చు కదా అని.

    As a side note,...

    పీ వీ అంటే మా కుటుంబం లో అందరికీ తగని అభిమానం. ఆయన గురించి పీ వీ ఆర్ కే ప్రసాద్ గారు రాసిన వ్యాసాలు చదివి దాచుకున్నాం.

    ReplyDelete