
అన్నగారు ఎంతైనా కాస్త గ్లామర్ తెచ్చి వివేకానంద గెటప్, వ్యవసాయదారుని గెటప్, ముస్లిం ల షేర్వానీ గెటప్ లాంటివి వేసి రాజకీయాలకి గ్లామర్ టచ్ ఇచ్చి ప్రజల్ని డైలాగులతో రంజింపచేసారు కదా..

ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ గ్లామర్ ఎలక్షన్లకి మాత్రమే పరిమితి అయ్యిందేమో..
మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాల్సిన బాధ్యత 'మార్పు ' అన్న నినాదం తో వచ్చిన మెగా స్టార్ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు కదా.. ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందు లో మరీ అరబ్ షేక్ అవతారమెత్తి కళ్ళకి సుర్మా దగ్గర్నించీ అతి జాగ్రత్త గా అత్యంత సహజం గా కనిపించేలా తగు జాగ్రత్తలు తీసుకుని.. ప్రేక్షక లోకానికి.. సారీ సారీ ప్రజానీకానికి కనువిందు కలిగిస్తే..


మీరు భలేవారే రత్న ప్రభగారు
ReplyDeleteఅలాంటి వేదికల్లో ఎవడో చేలే గాడు అప్పటికప్పుడు
అలా టోపీ లు గట్రా పెట్టేస్తే ,రాజకీయ నాయకులూ
కాదంటే ఎక్కడ ఆ వర్గం వారి మనో భావాలు దెబ్బ తింటాయో
అని నోరుమూసుకుని పెట్టించుకుని ఫొటోస్ అవ్వగానే ఏ డ్రైవర్ కో ఇచ్చేస్తారు .
వొక్క ఎన్టిఆర్ మాత్రం తనే నోక్కేసేవారు .ప్రతి ఓపెనింగ్ కి బంగారు కత్తెర పెట్టాలని
ఆ శాఖ సెక్రటరీ కి మౌఖిక ఆదేశాలు వెళ్ళేవి .తీరా అద్దెకి తెచ్చి పెడితే ఓపెన్ చెయ్య గానే
ఎన్టీఆర్ జేబులోకి నోక్కేసేవారు .
చిరంజీవి సి.ఎం ఎప్పుడు అయ్యాడు ? అసలు అవుతాడా?
ReplyDelete@Anonymous,
ReplyDeleteనిజమే :-) నాయకులు అని రాద్దామని సీ ఎం లని పెట్టాను టైటిల్.. మార్చాను..
@రవిగారు,
ReplyDelete:-) రోశయ్య గారు మాత్రం .. పాపం కొంచెం కర్చీఫ్ సైజ్ పెద్దదైందో.. అలవాటు లేకనో.. చాలా గమ్మత్తు గా కనిపిస్తున్నారు..