ఈ టైటిల్ తో ఒక వార్త ఈనాడు పత్రిక లో వచ్చింది ఈరోజు.
మాజీ ప్రధాని పీ వీ నరసిం హారావు 90 వ జయంతి ని కాంగ్రెస్ నేతలు ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారట బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు.. ఆయన జయంతి లో కాంగ్రెస్ ఎం ఎల్ యే లూ, ఎం పీ లూ ఎవరూ పాల్గొనక పోవటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
అంటే.. మాజీ/ప్రస్థుత ప్రధాని,అధ్యక్షుల జయంతి ఉత్సవాలు ప్రతి యేటా ఎం ఎల్ యేలూ, ఎం పీ లూ జరపాలా?
దాదాపు ముప్ఫై మంది పుట్టినరోజులు జరుపుతూ ఉంటే ఇంక వేరే పనులేం చేస్తారు?
వారి సంగతి వదిలేస్తే..
మొన్నీ మధ్య రాహుల్ గాంధీ పుట్టినరోజు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు... కానీ ముఖ్యమంత్రి రోశయ్య గారు కూడా రాహుల్ ఫొటో కి కేక్ తినిపించటం కాస్త ఎబ్బెట్టు గా అనిపించలేదూ?
Wednesday, June 30, 2010
Tuesday, June 29, 2010
చందమామ పువ్వులనెప్పుడైనా చూశారా?

ఎవరో నాకీ విత్తనాలిస్తే ఏవోలే అని వేశాను. నెల తర్వాత.. ప్రతిరోజూ ఒక అద్భుతం నా ఫ్రంట్ యార్డ్ లో..
సాయంత్రం 4.30-5.00 గంటల మధ్య చందమామ పలకరించగానే విరిసి, తెల్లవారేసమయానికి ముడుచుకునే పూలివి...

నెలరాజునలరించటానికే వీటి జన్మ, ఆయన కి వీడ్కోలు చెప్పే ముందే ఎడబాటుని తట్టుకోలేము, అన్నట్టు ముందు గానే నిష్క్రమిస్తాయి..
కలువ పూల మొగ్గ లా ఒక మెగా సైజ్ సన్నజాజి లా సుకుమారం గా ఉంటాయి మొగ్గలు. మనం దాని వైపు చూస్తూ ఉండగానే.. 'ఠప్ప్ ' మని అరచేతి పరిమాణం లో విచ్చుకుంటాయి. ఈ విన్యాసం జరగేది జస్ట్ .. అర సెకన్ వ్యవథి లో.. తెల్లవారాక దాని అవశేషం తప్ప ఏదీ ఉండదు చూట్టానికి..
Thursday, June 24, 2010
అజ్ఞాత, శరత్ 'కాలం', మాలిక నిర్వాహకులు ఏకలింగం గారూ,
అజ్ఞాత,
తెలుగు బ్లాగు మొదలు పెట్టిన 15 రోజులకే కామెంట్ మోడరేషన్ అవసరాన్ని అర్థమయేలా.. కామెంట్లు విడిచినందుకు!
శరత్ 'కాలం' గారికి,
మీ టపా చూసిన తర్వాతే నా బ్లాగ్ కామెంట్లు చూశాను. వెంటనే పోస్ట్ తొలగించాను.. కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేసి మళ్ళీ ప్రచురించాను.
మీ టపా కీ, టపా లో చూపించన సపోర్ట్ కీ కృతజ్ఞతలు.
మాలిక నిర్వాహకులకి,
ప్రత్యేక ధన్యవాదాలు! కామెంట్లు తొలగించినందుకు!

అత్తాకోడళ్ళ సంవాదం..
మా ఫ్రెండ్ అత్తగారు అమెరికా కెళ్ళింది. ఇద్దరు కొడుకులిళ్ళల్లో ఇంచుమించు గా ఒకే పరిస్థితి. భార్యా భర్తలు అన్నీ కలిసే పని చేసుకుంటున్నారు. ఆవిడ కి కాస్త బాధనిపించింది. పాత కాలం ఆవిడ కదా..
ఆవిడ తెలుగు టీచర్! వెరైటీగా ఆవిడ ఆక్రోశాన్ని వచన కవిత్వం గా ప్రకటించారు.
పాలలో మురిపాలు కలిపి,
కారం లో మమకారం వంపి,
అరిచేతులని పాదాల కింద నిలిపి
ఎంతో ప్రేమగ పెంచితి,
(కానీ..ఈరోజున)
కోడళ్ళకి టీలందించి,..
వంటలు వండి, బట్టలుతికి, (లాండ్రీ లో బట్టలు వేయటం అని ఆవిడ భావం)
ఆమెర(రి)కన సుఖపడుదరని పెండ్లి చేసి పంపితి..
తండ్రులారా, మీ కష్టం నే చూడజాల!
..
ఈ కవితలని తెలిసిన వాళ్ళకి చూపి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసు కోవటం తో కోడలు పిల్లకి మండింది. అదేమని దెబ్బలాడితే.. చాతనైతే.. పద్యరూపం లో సమాధానం ఇవ్వమని చాలెంజ్ విసిరింది అత్తగారు. కోడలు తక్కువదా..ఆవిడా స్వీకరించి ఇలా రాసింది..
వచ్చితిమేమత్తింటికి పుట్టింటిని వీడి పెక్కు యాశలతోడన్..
తెచ్చితిమేమింట వెలుగు, మెచ్చుచు మా భర్తలు కడు డెందము మీరన్,
ముచ్చట పడి ఇంటిపనులు, మురిపముగ చేయబూన ముందుకు రాగా..
రచ్చన ప్రకటించి నీవు పరిహాసం చేయబూన తగునే యత్తా?
అత్తగారు ఎంతైనా టీచర్ కదా, కళ్ళజోడు పెట్టుకుని చందస్సు దిద్దటం మొదలు పెట్టేసారు వెంటనే... సెభాష్ కోడలా అంటూ

Monday, June 21, 2010
అల్లరి శ్రేయ కబుర్లు -2
అల్లరి శ్రేయ,వాళ్ళక్కా టీచర్, స్టూడెంట్ ఆట ఆడితే.. ఎప్పుడూ వాళ్ళక్కే టీచర్ అవుతుంది. దీనికేమో..అది ఆట లా కాకుండా స్కూల్ కెళ్ళినట్టుందని 'నేనాడను పో' అంది మొన్న. వాళ్ళక్క బెందిరించి,గొడవచేసి ఆడేలా ఒప్పించింది.
బెత్తం, అవీ పట్టుకుని ఇంకా రావేంటి.. అంటే 'నేనివ్వాళ్ళ ఆబ్సెంట్ అన్నమాట ' అంది..
**********************************************************************************
అది యూ యెస్ నుండి ఇండియా కి నెల రోజుల ట్రిప్ కి వెళ్ళి వచ్చింది. ' ఇండియా ఎలా ఉందమ్మా? ' అని అడిగింది వాళ్ళకి తెలిసినావిడ.
శ్రేయ అంది.. ' ఇండియాకీ, అమెరికాకీ ఒక తేడా ఉంది ' ..
అబ్బో అంత తేడా ఏంటబ్బా? అంటే చెప్పింది.. 'ఇండియా లో ఇంటి బయట డర్టీ గా ఉంటుంది, ఇంట్లో (నాయనమ్మ ఇంట్లో) నీట్ గా ఉంటుంది. అమెరికా లో ఇంట్లో డర్టీ గా ఉంటుంది..బయట నీట్ గా' వాళ్ళమ్మ ముఖాన కత్తి వేటుకి నెత్తురు లేదు..

అల్లరి శ్రేయ,దానక్కా టీ వీ చూస్తున్నారు. శ్రీ కృష్ణుడు వేణువూదుతుంటే గోపికలు తన్మయత్వం తో తలలూపుతున్నారు. అక్క అంది నెమ్మదిగా ' వాళ్ళేంటి ఫూ.. అని వాయిస్తేనే ఇలా ఊగుతున్నారు? ' ఇది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే.. 'ఆకాలం లో వాళ్ళకున్న మ్యూజిక్ లో అదే బెస్ట్ ' అనేసింది.

ఓసారి అది శేషశాయి అయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతున్న పోస్టర్ తీక్షణం గా చూస్తోంది.. వాళ్ళమ్మ 'ఏంటమ్మా విష్ణుమూర్తి ని చూస్తున్నావ్? అని అడిగింది.
ఇది 'నేను బ్రహ్మని చూస్తున్నానమ్మా! ఆ లోటస్ లో కూర్చుని విష్ణుమూర్తి కదిలినప్పుడల్లా.. వీ ... వీ.. అని రోలర్ కోస్టర్ లా తిరుగుతాడేమో.. విష్ణుమూర్తి నుంచున్నా, నడుస్తున్నా!!! పడిపోతాడా? గ్లూ పెట్టారా అని ' అంది.

శ్రేయ ఇంటికి చుట్టాలొచ్చారు. లాండ్రీ లోంచి బట్టలు తెచ్చింది వాళ్ళమ్మ పెద్ద జాలీ ట్రాలీలో. వంట చేస్తుంటే.. చుట్టాలావిడ ఊర్కే కూర్చుంటే ఏం బావుంటుందని.. బట్టలు మడత పెడదాం అని తీయబోయింది. ఇది ఆపి..
' డోంట్ బాదర్ అత్తా! మా అమ్మ ఎప్పుడూ మడత పెట్టదు. మాక్కావలసినవి.. ఈ చిల్లుల్లోంచి లాక్కుంటాం ఎప్పుడూ.. చుట్టాలొచ్చే ముందు మాత్రమే మడత పెడుతుంది.. మీరెళ్ళిపోతున్నారు గా ఈరోజు? ' అంది. వాళ్ళమ్మ తల పట్టుకుని కూర్చుంది.

మరిన్ని తుంటరి శ్రేయ కబుర్లు ఇంకో టపాలో..
అల్లరి శ్రేయ కబుర్ల పాత టపా : http://rani-ratnaprabha.blogspot.com/2010/06/blog-post_11.html

Sunday, June 20, 2010
మోరీలు కడిగే రాములూ - ముకేశ్ అంబానీ
ఈరోజు ఈనాడు ఆదివారం అనుబంధం లో నీతా అంబానీ (భారతదేశం లో అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ గారి భార్య) తో ఇంటర్వ్యూ లో ఆవిడ చెప్పిన విశేషాలు వింటే .. మా మోరీ రాములు భార్య జీవితం గుర్తొచ్చింది :-) రాములు మోరీలు కడుగుతాడు, సెప్టిక్ ట్యాంకులూ అవీ క్లీన్ చేయటం.. అవీ చేస్తాడు.
27 అంతస్థుల మేడలో ఆరు వందల నౌకర్లూ,చాకర్లూ, స్విమ్మింగ్ పూలూ, నాలుగంతస్థుల కార్ పార్కింగూ, కట్టించారట ముకేష్ అంబానీ గారు.
మా రాములు 700 రూపాయల అగ్గిపెట్టె లాంటి చిన్న అద్దింట్లో .. తల్లీ, ముగ్గురు పిల్లలూ, భార్యా కాక, తమ్ముడూ,మరదలూ,వాళ్ళ కొడుకూ కూడా ఉంటారు. అత్తగారూ కోడళ్ళూ తెగ అరుచుకుని, కొట్టుకుని,కొప్పులూడేలా తన్నుకుంటారు రోజూ.. మర్నాడు పేలు చూసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు.
రాత్రి 10-11 గంటలకి ముకేశ్ ఇంటికొచ్చాక కలిసి తింటారట. భర్త గారు సజ్జ రొట్టే, ఉల్లికూరా.. నీతా గారు కూరముక్కలూ, పళ్ళూ,సూపులూ తప్ప అన్నం, చపాతీలూ ముట్టదట. 90 కిలోలనుండీ.. 47 కిలోలకి రావాలంటే ఈ త్యాగాలు తప్పవు కదా పాపం! కార్ లో మాత్రమే విరామం దొరుకుతుందిట. అప్పుడే ఆవిడ కునుకు తీస్తారుట.
రాములు కుటుంబం ఉదయం చద్దన్నం, తొక్కూ, ఉల్లిగడ్డా, ఏదుంటే అది.. మధ్యాహ్నం పని అయ్యాక నీళ్ళుంటే స్నానం చేసి మళ్ళీ అన్నమో రొట్టో, కారం తో.. తినగానే కంటినిండా నిద్రా.. సాయంత్రం మళ్ళీ చిల్లర పనులకోసం తిరగటం, ఎంత సంపాదన ఉంటే అంత, తినటమూ, తొంగోటమూ..

Friday, June 18, 2010
మాలతీ చందూర్ 'నన్ను అడగండి '
నా చిన్నప్పటినించీ మాలతీ చందూర్ గారి సమాధానాలు చూస్తూనే ఉన్నాను పత్రికల్లో. అప్పుడంతగా ఆలోచించలేదు ఆవిడ గురించి.. ఈ మధ్య మాత్రం స్వాతి పత్రిక లో ఆవిడ సమాధానాలు చాలా ప్రశ్నలకి అసలు పొంతన లేనట్టుగా ఉంటున్నాయి.
అదేదో కథ చెప్పినట్టుగా..
ఒకబ్బాయి ఆవు మీద వ్యాసం మాత్రమే నేర్చుకున్నాడట. పరీక్షలో తాజ్ మహల్ మీద రాయమన్నారట. అబ్బాయి మొదలు పెట్టాడట 'ఆగ్రా లో తాజ్ మహల్ ఉంటుంది. తాజ్ మహల్ పక్కన గడ్డి ఉండును.. ఆ గడ్డి లో ఆవు ఉండును. ఆ ఆవుకి రెండు కొమ్ములూ, తోకా....'
మచ్చుకి మీరే చూడండి.. (25.6.2010 స్వాతి వీక్లీ సంచిక లో పేజీ 56)
ప్రశ్న:
మన దేశం లో ఉన్నన్ని కులాలు, మతాలు మరే దేశం లోనైనా ఉన్నాయా?
సమాధానం :
ఎందుకుండవు? ఉంటాయి. సంపన్న దేశం అమెరికా లోనే ఉన్నాయి. 'మతం' అనే మాటని వ్యవస్థాజనితంగానూ, వ్యక్తిపరం గానూ వాడతారు. 'వాడి మతం వాడిది ' అంటే ఆ వ్యక్తి ఇష్టాయిష్టాకలి సంబంధించిన ప్రవర్తన.
ప్రవక్తలు సన్మార్గమే బోధిస్తారు. వ్యాఖ్యాతలు మాత్రం తమకి అనుకూలం గా మార్చుకుని, శిష్యప్రశిష్యులని తయారు చేసుకుని. స్థానబలిమిని కాపాడుకుంటారు. రాజ్యాంగ శాసనకర్తలు వెనకబడిన తరగతులకి పది శాతం రిజర్వేషనులను కల్పిస్తూ, మనది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి రాష్ట్రాలకు ఆ విషయం లో స్వాతంత్ర్యమిచ్చారు.
సుప్రీం కోర్ట్ యాభై శాతం దాటకూడదని రూలింగ్ ఇచ్చేదాకా రిజర్వేషనుల సంతర్పణం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు. రెడ్లలో, బలిజలలో, నాయుళ్ళలోగల శాఖోపశాఖలు మనై ఆశ్చర్యపరుస్తాయి. ఇక బ్రాహ్మణులలో నియోగా, వైదీకా?, మధ్వులా? తిరుచూర్ణయా? విబుదా?, స్మార్తులా అని ముఖం మీదనే అడిగేవారట.
యేరవతల సంబంధం చేసుకోకూడదనే సంప్రదాయ సరళి గల సంఘం లో అనేకానేక కులాలు ఆవిర్భవించాయి. బ్రాహ్మణులు చేపలు తినటమేమిటని ముక్కు మీద వేలేసుకుంటారు. కాని బెంగాల్ లో వారికవి జలపుష్పాలు. ప్రస్తుతం మన దేశం లో మూడువేల కులాలు ఉన్నాయంటారు గణాంక లెక్కలు చెప్పేవారు.

Subscribe to:
Posts (Atom)