కొన్నేళ్ళక్రితం మా అత్తయ్య ఒకావిడ ఇంటికెళ్ళాం.. మేము .. అన్నం పెడుతోంది ఆవిడ. మా మామయ్య ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫ్.. అందరికీ టేబుల్ మీద వడ్డిస్తోంది ఆవిడ. మా మామయ్య.. సడెన్ గా.. 'లక్ష్మీ.. ఏ కూరా అది.. తక్కువ చేసాను.. చుట్టాలకి మాత్రమే.. మీరు చూసి తినండీ అన్నావ్? ' అని అడిగారు. దెబ్బకి అందరూ .. గాన్.
ఓ సారి హాయిగా కాళ్ళు చాపుకుని సోఫాల్లో 20 పుస్తకాలు, పత్రికలూ, పేపర్లూ, చిప్స్ పాకెట్లూ, ఉతికిన బట్టలూ, ఆఫీస్ బాగులూ, లాప్ టాపులూ, కట్ చేస్తున్న కూరగాయలూ అన్నీ వేసుకుని టీ వీ చూస్తున్నాం..సెలవ పూట మా స్నేహితురాలి ఇంట్లో.. వాళ్ళ చెల్లి కి పెళ్ళికొడుకుని చూస్తున్నారు. పక్క అపార్ట్ మెంట్ లల్లోనే ఉంటారు ఆయన. మీ తో ఒక చిన్న పని ఉంది రావచ్చా? అని అడిగాడాయన ఫోన్ చేసి.. మా ఫ్రెండ్, నేనూ, యుద్ధ ప్రాతిపదిక మీద హాల్ అంతా క్లీన్ చేసే పని లో పడ్డాం. ఇప్పుడు టైం లేదు.. బెడ్ రూం లో కి తోసేద్దాం అంది తను. అంతే.. ఇంకేముంది అన్నీ విసిరేసాం. హాల్ మాత్రం హోటల్ రూం లా ఉంది. 'మేమెప్పుడూ ఇంతే.. టైప్ లుక్కు తో కూర్చున్నాం ' ఆయన వచ్చి నీళ్ళూ,అవీ ఇచ్చాక.. మీ ఇంటర్నెట్ వాడవచ్చా? అని అడిగాడు.. గతుక్కుమన్నాం. మరి ఇంటర్నెట్ కి రౌటర్ వాళ్ళ బెడ్ రూం లోనే ఉంది. ట్విన్ టవర్స్ శిథిలాల మధ్యనుండి నడిచినట్టు నడవాల్సి వచ్చింది మాకు .. ఆయనకి రౌటర్ నుండి వైర్ ఇవ్వటానికి.. :-(
ఒకసారి మా దూరపు చుట్టాలొచ్చారు ఇంటికి.. వాళ్ళమ్మాయి ఒడ్డూ,పొడుగూ ఇద్దరూ ఇంచు మించు ఒకే రకం గా ఉన్నారు. పిల్లలు ముందు నడుస్తుంటే.. పెద్దవాళ్ళు వెనగ్గా .. వస్తున్నారు. మా చెల్లి వంకరగా, డాన్స్ చేస్తూ, తింగరగా నడుస్తోందని మా అమ్మ రోడ్డని కూడా చూడకుండా.. ఒక్కటిచ్చింది.. వెనక నిండి.. 'ఏంటి ఈ వెకిలి నడక రోడ్ మీద? ' అని.. చూస్తే ఏముంది.. మా అమ్మ వేసింది చుట్టాలమ్మాయిని.
ఒక సారి ఇలాగే కొంచెం దూరం చుట్టాలు పిన్ని వరస.. వాళ్ళింటికెళ్ళాను. కాలేజ్ లో ఉన్నాను అప్పుడు. హాల్ లో ఫ్లూట్ పడి ఉంది. చూసి.. 'జన గణ మనా ట్రయ్ చేద్దామని వాయిస్తున్నాను.. మా పిన్ని లోపలనుండి..వాళ్ళబ్బాయనుకుని ' నీ వెధవ వాయింపుడు వినలేక ఉరేసుకోవాలనిపిస్తుంది.. ఆపరా చెత్త...' లాంటి పొగడ్తలతో మమ్మల్నలరించింది..
మరిన్ని విశేషాలతో మరో టపాలో..
Monday, June 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
hahahhaha gud one.........
ReplyDeleteha ha super
ReplyDeleteథాంక్స్!
ReplyDeleteఇలాంటి సంఘటనలు అందరికీ ఉంటూనే ఉంటాయి. ఊర్కే గుర్తొచ్చినవి నాలుగు టపాలో వేసాను.
రేడియేషన్ గురించి మన పూర్వికులకి తెలుసు అంటే నమ్మడానికి మేము చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు, పంగనామాలూ పెట్టుకోలేదు. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు ఏర్పడతాయని గ్రీస్ లో పైథాగరస్ శిష్యులు చెప్పినప్పుడు జనం నమ్మలేదు, ఇండియాలో ఆర్యభట్టు చెప్పినప్పుడు కూడా జనం నమ్మలేదు. అంత అంధకారం ఉన్న రోజుల్లో మన పూర్వికులు రేడియేషన్ గురించి ఊహించారంటే నమ్మాలా?
ReplyDeleteరేడియేషన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే రేడియేషన్ అంతే కాంతి అని చెప్పొచ్చు. Infrared rays are not visible light but they can be detected through experiments. Ultra-violet rays are visible to some species of animals but not to human beings. The extent of visible light is less in sunrays but the high intensity of invisible rays such as infrared and ultraviolet rays can cause damage to eyes. High intensity of ultraviolet rays can even cause skin cancer. There is a lot to study about light that you can find in reference books.
గ్రహణ సమయంలో భోజనాలు చెయ్యకూడదని కొందరు బ్లాగర్లు కబుర్లు చెప్పారు కదా. ఆహారం మీద ఏ రకం రేడియేషన్ పడినా ఏమీ కాదు. అల్ట్రావయొలెట్ కిరణాలూ, గామా కిరణాలూ పడితే (with adequate intensity) వాటి టెంపరేచర్ పెరుగుతుంది. గ్రహణ సమయంలో రేడియేషన్ ప్రభావం మాత్రం ఆహారం పై ఉండదు. అయినా గ్రహణ సమయంలో భోజనం చెయ్యకూడదు అనీ, రేడియేషన్ వల్లే భోజనం చెయ్యకూడదని రేడియేషన్ గురించి తెలియని మన పూర్వికులు చెప్పారనీ అంటే జనం చెవుల్లో పువ్వులు ఉన్నాయి అనుకున్నట్టే.
మీరు చిన్నప్పుడు చదువుకున్న సైన్స్ పాఠాలు మీకే గుర్తున్నాయో లేదో? ఇన్ఫ్రారెడ్ కిరణాలు ప్రతినిత్యం సూర్యుడు నుంచి వస్తుంటాయి. కానీ వాటి ప్రభావం ఏ సమయంలోనైనా తక్కువే. సూర్యుడిని డైరెక్ట్ గా కళ్ళతో చూడకపోతే ఇన్ఫ్రారెడ్ కిరణాల వల్ల కళ్ళు ఏ రకంగానూ పోవు. గ్రహణం సమయంలోనైనా సూర్యుని వైపు డైరెక్ట్ గా చూడకుండా బయట తిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఏమీ కాదు. ఈ విషయం తెలియకే కొంత మంది గ్రహణం టైమ్ లో బయటకి రారు.
బియ్యాన్ని ఎండలో ఎండబెట్టి సూర్యుని రేడియేషన్ దాని మీద ఎక్కువ సేపు పడేలా చేసి వంటి తిని చూడు, ఏమీ కాదు. గ్రహణం టైమ్ లో భోజనం చెయ్యడం నేను చిన్నప్పటి నుంచీ చేస్తున్నదే. నాకు ఏమీ కాలేదే.