అల్లరి శ్రేయ,వాళ్ళక్కా టీచర్, స్టూడెంట్ ఆట ఆడితే.. ఎప్పుడూ వాళ్ళక్కే టీచర్ అవుతుంది. దీనికేమో..అది ఆట లా కాకుండా స్కూల్ కెళ్ళినట్టుందని 'నేనాడను పో' అంది మొన్న. వాళ్ళక్క బెందిరించి,గొడవచేసి ఆడేలా ఒప్పించింది.
బెత్తం, అవీ పట్టుకుని ఇంకా రావేంటి.. అంటే 'నేనివ్వాళ్ళ ఆబ్సెంట్ అన్నమాట ' అంది..
**********************************************************************************
అది యూ యెస్ నుండి ఇండియా కి నెల రోజుల ట్రిప్ కి వెళ్ళి వచ్చింది. ' ఇండియా ఎలా ఉందమ్మా? ' అని అడిగింది వాళ్ళకి తెలిసినావిడ.
శ్రేయ అంది.. ' ఇండియాకీ, అమెరికాకీ ఒక తేడా ఉంది ' ..
అబ్బో అంత తేడా ఏంటబ్బా? అంటే చెప్పింది.. 'ఇండియా లో ఇంటి బయట డర్టీ గా ఉంటుంది, ఇంట్లో (నాయనమ్మ ఇంట్లో) నీట్ గా ఉంటుంది. అమెరికా లో ఇంట్లో డర్టీ గా ఉంటుంది..బయట నీట్ గా' వాళ్ళమ్మ ముఖాన కత్తి వేటుకి నెత్తురు లేదు..
**********************************************************************************
అల్లరి శ్రేయ,దానక్కా టీ వీ చూస్తున్నారు. శ్రీ కృష్ణుడు వేణువూదుతుంటే గోపికలు తన్మయత్వం తో తలలూపుతున్నారు. అక్క అంది నెమ్మదిగా ' వాళ్ళేంటి ఫూ.. అని వాయిస్తేనే ఇలా ఊగుతున్నారు? ' ఇది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే.. 'ఆకాలం లో వాళ్ళకున్న మ్యూజిక్ లో అదే బెస్ట్ ' అనేసింది.
**********************************************************************************
ఓసారి అది శేషశాయి అయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతున్న పోస్టర్ తీక్షణం గా చూస్తోంది.. వాళ్ళమ్మ 'ఏంటమ్మా విష్ణుమూర్తి ని చూస్తున్నావ్? అని అడిగింది.
ఇది 'నేను బ్రహ్మని చూస్తున్నానమ్మా! ఆ లోటస్ లో కూర్చుని విష్ణుమూర్తి కదిలినప్పుడల్లా.. వీ ... వీ.. అని రోలర్ కోస్టర్ లా తిరుగుతాడేమో.. విష్ణుమూర్తి నుంచున్నా, నడుస్తున్నా!!! పడిపోతాడా? గ్లూ పెట్టారా అని ' అంది.
**********************************************************************************
శ్రేయ ఇంటికి చుట్టాలొచ్చారు. లాండ్రీ లోంచి బట్టలు తెచ్చింది వాళ్ళమ్మ పెద్ద జాలీ ట్రాలీలో. వంట చేస్తుంటే.. చుట్టాలావిడ ఊర్కే కూర్చుంటే ఏం బావుంటుందని.. బట్టలు మడత పెడదాం అని తీయబోయింది. ఇది ఆపి..
' డోంట్ బాదర్ అత్తా! మా అమ్మ ఎప్పుడూ మడత పెట్టదు. మాక్కావలసినవి.. ఈ చిల్లుల్లోంచి లాక్కుంటాం ఎప్పుడూ.. చుట్టాలొచ్చే ముందు మాత్రమే మడత పెడుతుంది.. మీరెళ్ళిపోతున్నారు గా ఈరోజు? ' అంది. వాళ్ళమ్మ తల పట్టుకుని కూర్చుంది.
**********************************************************************************
మరిన్ని తుంటరి శ్రేయ కబుర్లు ఇంకో టపాలో..
అల్లరి శ్రేయ కబుర్ల పాత టపా : http://rani-ratnaprabha.blogspot.com/2010/06/blog-post_11.html
Monday, June 21, 2010
Subscribe to:
Post Comments (Atom)
అయ్యా బాబోయ్.. మీ శ్రేయా సీమ టపాసులా ఉందిగా అసలు! ఇంతకీ ఎన్నేళ్ళన్నారూ శ్రేయాకి?
ReplyDeleteమధురవాణి గారు,
ReplyDeleteశ్రేయ మొదటి తరగతి, వాళ్ళక్క ఐదవ తరగతి. కొన్ని వాళ్ళక్క కబుర్లు కూడా మిక్స్ అవుతున్నాయేమో.. నాకు వాళ్ళు నాలుగైదేళ్ళు గా పరిచయం. అప్పట్నించీ జరిగిన సంఘటనల్లోంచి గుర్తున్నవి రాస్తున్నాను.
పిల్లలు కాదు పిడుగులు
ReplyDeleteనిజంగానే ఈ శ్రేయ చిచ్చరపిడుగే.... మూడేళ్ళకే ఎన్ని మాటలు!
ReplyDeleteVery nice..
ReplyDeleteMy best wishes to Shreya..
Plz write daily..
& it ll become a great biography..
We ll waiting for it..
Thanq..
మరీ ఇంత షార్ప్ ఆ
ReplyDeleteso sweet
శ్రియా కి తెలుగు బ్లాగుల్లో అభిమానులు పెరుగుతున్నారు అని చెప్పండి
వద్దులెండి మరో కౌంటర్ పడుతుంది మా అందరి మీద :)
అబ్బ...ఎంత ముచ్చతెస్తుందో మీరు చెపుతుంటే....
ReplyDeletechoooooo cweeeeeeeeet
అమ్మాయి పేరెంట్స్ చాల అదృష్ట వంతులు కదండీ ....