Friday, June 11, 2010

అల్లరి శ్రేయ కబుర్లు..

మా కాలనీ లో ఒక పాప శ్రేయ..మరాఠీ పిల్ల.. దానికి మూడేళ్ళు.. అదంటే అందరికీ హడల్...

అదొక పెళ్ళి కెళ్ళింది.. భజంత్రీలు ఆపేసారు ఒక్కసారిగా..ఎవరో చెప్పారని.. సరిగ్గా అప్పుడే అది పంతులుగారి ట్రాన్స్పరెంట్ తెల్ల ధోవతి లోంచి ఎర్ర రంగు షార్ట్స్ గమనించి.. 'అమ్మా.. నేనూ, పంతులుగారూ మాచింగ్ లాగూలేసుకున్నాం ' అని అరిచింది.. పాపం ఆయన దెబ్బకి శాలువా చుట్టుకుని.. ఒక పట్టాన పీట మీదనించి లేవలేదు..


ఒకరోజు దానికి చాక్లేట్ తినాలనిపించింది. పక్కింటికెళ్ళి అడిగింది.. పెద్దవాళ్ళందరికీ వాళ్ళమ్మ ముందే చెప్పి ఉంచింది.. సొ ఆవిడ చెప్పేసింది నిర్మొహమాటంగా.. 'ఇవ్వను ' అని..

సరే.. ఇంకోళ్ళింటికెళ్ళింది.. తలుపు కొట్టింది.. వాళ్ళ పెద్ద పిల్ల దీప చదువుకుంటుంది. దానికి చిరాకు, వాళ్ళ చెల్లెలూ, ఇదీ హడావిడి చేస్తారని.. తలొక్కటే బయట పెట్టి అడిగింది.. 'ఏం కావాలి?' అని.

ఇది.. 'మధు తో ఆడుకోవచ్చా?'
దీప ... 'లేదు.. అది బయటకి రాదు..'

మళ్ళీ తలుపు కొట్టింది..

ఇది .. 'పోనీ నేను లోపలికి రావచ్చా? '
దీప ... 'లేదు, సారీ'

మళ్ళీ తలుపు కొట్టింది..

ఇది .. 'ఏదైనా చాక్లేట్ ఇస్తారా?'
దీప ... 'మా ఇంట్లో లేవు.. ఇంక మళ్ళీరాకు '

మళ్ళీ తలుపు..

ఇది నోరు తెరిచేలోపలే.. దీప అరిచింది 'నేను రావద్దని చెప్పానా? ఆడుకోవటానికి కుదరదు.. మా ఇంట్లో చాక్లేట్లు లేవు..'

ఇది .. 'ఒక చిన్న పాట పాడి వినిపించవచ్చా పోనీ?'
దీప కి ఏమనాలో అర్థం కాలేదు.. ' సరేలే..రా.. మా చెల్లితో ఆడుకో..కానీ.. ఏమీ శబ్దం చేయటానికి... '

వాక్యం కంప్లీట్ చేయనిస్తుందా? అది లోపలకెప్పుడో వెళ్ళిపోయింది.

మా ఇంటికొచ్చింది.. నేనేమో.. అప్పుడే మాంచి వర్షం గా ఉందని.. ఎర్రావకాయన్నం తింటున్నాను..

అది .. 'ఆంటీ.. నేనూ తినచ్చా?'
నేను .. 'లేదమ్మా.. కావాలంటే బిస్కట్ తిను..'
అది .. 'ఆంటీ.. మా అమ్మ చెప్పింది.. నీకెప్పుడైనా.. అన్నం తినాలనిపిస్తే.. ప్రభాంటీ దగ్గరకెళ్ళి అడుగు.. ఆవకాయ లాంటిది ఏమైనా వేయమని అడుగూ..

నేను.. 'నిజమా? అడుగుతానుండు.. ఫోనేది?'

ఇంకా అదెక్కడుంది? ఎప్పుడో తుర్రు..

మా ఎదురింటివాళ్ళింటికెళ్ళి చాక్లేట్ అడిగింది.. ఆవిడ 'లేవు ' అంది. ఇది ఒక్క మాట మాట్లాడకుండా వెనక్కి తిరిగింది.. ఆవిడ నొచ్చుకుని.. ఏంటీ అని అడిగితే.. చెప్పింది..

'ఇష్టం లేకపోతే.. ఇవ్వకండి.. కానీ..ఇలా అబద్ధం ఆడేవాళ్ళంటే నాకు చిరాకు '
ఆవిడ ముక్కున వేలేసుకుంది.

నిన్న వాళ్ళ నాన్న వెనకనుండి.. 'ఇప్పుడు బయటకెళ్తే..మళ్ళీ వెనక్కి రావు.. గుర్తుంచుకో!' అని వార్నింగ్. ఇది తలెగరేసి వెళ్ళిపోయింది.

రాత్రి 8 దాటింది అని..వాళ్ళ నాన్న, అన్ని ఫ్లాట్లు తిరుగుతూ.. వెతుకుతూంటే.. 'ఏం? ఏమయిపోయింది.. నీ పంతం? రానివ్వనన్నావ్ గా?' అంది..

ఇంకా మరిన్ని అల్లరి విశేషాలతో.. ఇంకో టపా లో..

7 comments:

  1. ఎవరీ చిచ్చరపిడుగు

    ReplyDelete
  2. మా ఫ్లాట్స్ లో పాప ఇది. దానికి తెలివెక్కువ. అల్లరీ ఎక్కువే..
    చురుకుదనానికి మారుపేరు. ఒకసారి లే అవుట్ లో జెండా కర్ర పైదాకా ఎగ పాకేస్తే వాళ్ళమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ..

    ReplyDelete
  3. మీ శ్రేయ అల్లరి గడుగ్గాయి అన్నమాట! :-)

    ReplyDelete
  4. अभिनंदन, खूब छान चिठ्टा आहे।

    ReplyDelete
  5. మూడేళ్ళమ్మాయికి ఇన్ని తెలివితేటలా? నిజమేనా ?

    ReplyDelete
  6. నీహారిక గారూ,

    అవును.. ఇప్పుడు దానికి ఆగస్ట్ లో 5 నిండుతాయి. నేను ఈ టపా లో చెప్పినవి.. కనీసం యేడాది క్రితం కబుర్లు.

    ReplyDelete