సాన్ హోసే లో నేను పని చేసేటప్పుడు మా బాసు డెట్ లెఫ్ గారు. ఆయన జెర్మన్.. ఆయన గారి గ్రూప్ లో తీరా చూస్తే.. అందరూ భారతీయులూ, చైనీయులూ. తెల్లగా ఆరున్నరడుగుల పొడుగూ, చూట్టానికి రిచర్డ్ గేరే లా ఉండేవాడు..
ఏదో ఒక విషయం లో నా భారతీయత అవమనింపబడేలా మాట్లాడుతూనే ఉండేవారాయన. చూసీ చూడనట్టు చాలా కాలం వదిలేసాము మేము.
మచ్చుకి.. లంచ్ టేబుల్ మీద ఇంటినుండి తెచ్చుకున్న తిండి తింటుంటే.. 'మాన్.. ఇట్ స్టింక్స్!' అనీ.. సల్వార్ కమీజ్లు వేసుకున్నప్పుడు.. 'Did you wake up today and thought.. I want to wear curtains today to work? Maan.. I would n't recommend that color to my enemies!!! ' అని.. కాఫె లో ఏదైనా కొనుక్కుంటే.. పైన.. మిరియప్పొడి, జల్లుకుంటుంటే.. 'ఆర్ యూ పెప్పర్ మానియాక్? ' అని..
సునామీ వచ్చినప్పుడు లక్షలాది మంది చనిపోవటం, నిరాశ్రయులవటం కలచివేస్తుంటే.. ఒక రోజు.. నా వన్ ఆన్ వన్ డిస్కషన్ లో ఆయన ఫామిలీ స్థిరపడిన ఫ్లారిడా లో ఒక మనిషి ఏదో రిపెయిర్ చేస్తుంటే.. పైన్నుంచి వర్షానికి చెట్టు కూలి బలయ్యాడట. చాలా బాధాకరమైన వార్త అని పదే పదే బాధపడుతుంటే.. ' ఆసియా లో లక్షలాది మంది.. ' ఇంకా వాక్యం పూర్తి చేసే లోపలే .. ఆయన చేయి ఊపుతూ.. 'ఏషియా ఈజ్ డిఫెరెంట్.. అక్కడ జనాభా ఎక్కువ.. మీ ఇండియన్లకి ఇలా ప్రకృతి ఉత్పాతాల్లో మరణాలు మంచిదేగా?' అన్నాడు.
' హెచ్ ఆర్ కి వెళ్ళనా? ' ఈ ముక్క మీద? అని గద్దించేసరికి.. 'నేనేమన్నాను? ఏమీ అనలేదు.. నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు..' అని మాట మార్చాడు..
ఒకరోజు.. స్టాఫ్ మీటింగ్ అయ్యాక 20 మంది పైగానే ఉన్నారు.. ఆయన 'ఇండియానా జోన్స్ ' చూసాట్ట.. చర్చ మొదలు పెట్టాడు. నేను లేవబోతుంటే.. 'ప్రభా.. నువ్వేమో వెజిటేరియన్ అంటావు.. ఈ సినిమాలో వాళ్ళు చూడు కోతి మెదళ్ళు తింటారు.. ' అని వెక్కిరింపు గా అన్నాడు. అక్కడ అందరూ, విప్రో, హెచ్ సీ యెల్ లాంటి కాంట్రాక్టింగ్ కంపెనీలనుండి 3 నెలల వీసా మీద వచ్చిన వాళ్ళే.. ఎవ్వరూ ఏమీ అనలేదు .. రిస్కెందుకు అని..
నేను మాత్రం.. ఊర్కోలేదు.. 'యా.. డెట్ లెఫ్! బీ కేర్ ఫుల్ విత్ అజ్ ' అన్నాను. ఆయనకి ఒక క్షణం అర్థం కాలేదు... అయ్యాక 'వెయిట్ అ మినిట్.. డిడ్ యూ జస్ట్ కాల్ మీ మంకీ?' అని నా వెనక వచ్చాడు.
నేను వెనక్కి తిరిగి 'యౌ డోంట్ నీడ్ టు బి కన్సర్నెద్, వీ ఓన్లీ ఈట్ బ్రెయిన్స్.. అండ్ యూ డోంట్ సీం టు హావ్ వన్ ' అన్నాను.
అందరూ నా చుట్టూ మూగి.. అభినందించటం తో.. ఇంక మాట్లాడలేక వెళ్ళిపోయాడాయన.
Sunday, June 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
తిక్క కుదిరింది తింగరగా మాట్లాడినందుకు! మంచి పని చేశారు :-)
ReplyDeleteబాగుంది. మంచి జవాబిచ్చారు. అక్కడేమో భారతీయులంటే చిన్నచూపు చూసేవారు ఎక్కువ. ఇక్కడేమో పరాయిదేశాలను భుజాన వేసుకోనేవారెక్కువ.
ReplyDeleteశ్రీవాసుకి
LoooooooL nice reply to a racist.
ReplyDeleteప్రభ గారూ !
ReplyDeleteకుక్క కాటుకు చెప్పుదెబ్బ .... మౌనం చేతగానితనం అనుకునే అహంకారులకి తగిన బుద్ధి చెప్పారు. అభినందనలు.
ఫఠ్! అలా ఉండాలి దెబ్బంటే!! మళ్ళీ నోరిప్పితే, ఆ రెండోది పడినట్టు పడాలి.
ReplyDeleteచప్పట్లు!!
This comment has been removed by the author.
ReplyDeleteఅందరికీ,
ReplyDeleteథాంక్స్!
MV అజ్ఞాతగారూ,
ప్రత్యేక ధన్యవాదాలు! ఆంగ్లం లో ఇచ్చిన సమాధానం తెలుగు లో సరిగ్గా తర్జుమా చేయలేక.. అలా రాసాను. ఆంగ్లం లో ఇచ్చిన సమాధానం తెలుగు లో సరిగ్గా తర్జుమా చేయలేక.. అలా రాసాను. నిజమే ఆయన వర్షన్ కూడా విన్నప్పుడే సంపూర్ణత వస్తుంది :-).. దానికి ఆయన బ్లాగ్ చూడాలి..
అలాంటి వాళ్లు ఒకరిద్దరు అన్ని చోట్లా ఉంటారు (ఇన్నేళ్లలో నాకు ఒకరూ తగల్లేదు - బాస్ కానీండి, తోటి ఉద్యోగి కానీండి). అంతమాత్రానికి అందరూ అంతే అని సాధారణీకరించనవసరం లేదు. (మీరు కాదు, ఒకరిద్దరు వ్యాఖ్యాతలు)
ReplyDeleteనాకు ఇప్పటివరకూ ఇలాంటి smart ass లు ఒకళ్లు కాదు, కనీసం ఓ డజను మంది తగిలారు, (నేను పనిచేసేది Texas లో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా :)), EDS/ATT/BOA/JCPENNY/verizon లాంటి పెద I.T. కమెనీలన్నీ ఒక్కసారే outsourcing మొదలుపెట్టటం వలన ఉద్యోగాలు పోతున్నయన్న కడుపుమంటతోనో యాజమాన్యాలలను ఏమనలేక ఎందురుగా కనిపించే భారతీయుల మీద నోరు పారేసుకొనేవాళు తరచుగానే. green card వచ్చే వరకు నోరుమూసుకొని ఉండి, ఆ తర్వాత అందరకీ కాకపోయినా అందులో కొందరికి బాగానే జలక్లు ఇచ్చేవాడిని నేను కూడా.
ReplyDeleteమచ్చుకు
1. భారతీయులు ఎప్పుడూ జపనీసు కార్లే కొంటూ ఉంటారు అదీ మూసగా బుఱ్ఱ లేకుండా అని "కావాలని" మాటిమాటికి కామెంట్ వేసేవాడికి చూసి చూసి, నేను అన్నమాట Tom, how do you expect us to buy American cars after seeing you guys (software) designs అని. ఎందుకంటే వాళ్లు వేసిన design ఎంత చెత్తదో అంతకముందే discuss చేసుకొన్నాము. ఆ దెబ్బతో నా ముందు, ఎప్పుడూ మళ్లీ దేశీయులను చులకన చేయలేదు.
2. నా బాస్ ఒకడు ఉండే వాడు నల్లోడు మరియు కిరస్తాని మత పిచ్చోడు. మాటి మాటికి ఈ ఆదివారం ఏమి చేస్తున్నావు, మా చర్చ్ కు రా అని అడిగేవాడు, నేను హిందువు ను అని తెలిసి కూడా!! చూసి చూసి, ఓ రోజు అందరి ముందు అడుగుతున్నప్పుడు, అలాగే చర్చ్ కి వస్తాను, అక్కడినుండి ఇద్దరం కలసి నీ కుటుంబం తో మా గుడికి వెల్దాము, btw మా దేముడు క్రిష్ణుడు నల్లవాడు తెలుసా, he would appreciate a fellow black praying to him అన్నా, మళ్లీ చర్చ్ కి పిలవలా
3. మీ భారతీయులకు మీ దేశంలో పనేమి లేదా, వచ్చి మా దేశంలో వాలిపోతున్నారు అని అన్న ఒ తెల్ల మిత్రునకు We are like your firefighters, when we realize your I.T. industry is in flames and your firefighters are useless, we have nochoice but jump in to rescue,right! అంటే, ఇంకేమి మాట్లాడలా :)
మన వలన వాళ్ల ఉద్యోగాలు పోతాయేమో అన్న భయంతో, ఆ ఆక్రోశం తో, కడుపుమంట తో మంచి వాళ్ళు కుడా కొందరు, ఇలాంటి డవిలాగులు కొట్టటం సహజం, మనం కుడా వాళ్ళ పరిస్తితులలో ఉంటె అలానే ప్రవర్తిన్చేవాల్లమేమో అని ఓ సారి అనిపిస్తూ ఉంటుంది. కొందరు మాత్రం వాళ్ళ సహజ racism తో పిచ్చివాగుడు వాగుతుంటారు. అలాగని అందరు అలానే ఉంటారు అని అనలేము.
@అబ్రకదబ్ర,
ReplyDeleteఅవును, పదేళ్ళ అమెరికా జీవితం లో నాకు తగిలినది.. ఈయన ఒక్కరే.. చాలా మంది వెనక ఏమనుకున్నారో మనకి తెలియదు కానీ గౌరవం గానే మాట్లాడేవాళ్ళు. ఈయన మాత్రం మాకు 2 యేళ్ళు బాస్ గా ఉన్నారు. కామెంట్లు చాలా చేసేవాడు.
@కృష్ణ,
ReplyDelete:) మీరన్నది నిజం. కొంతమంది లో ఇది అభద్రతా భావం తో వచ్చిన ఒక పార్శ్వం. 2001 లో ఈ తరహా స్వభావం ఎక్కువగానే కనిపించేది అక్కడక్కడా..
మా డెట్ లెఫ్ గారు మాత్రం చిన్నచూపుగా మాట్లాడినా, వీళ్ళేమీ చేయరు, హెచ్ ఆర్ కి అంత ఈజీ గా వెళ్ళరు అన్న ధైర్యం తో అలా మాట్లాడేవారు... ఆయనకి ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు..
Mr.Krishna
ReplyDeleteI read about you as anti-religious (not hetuvaadi - I hardly seen such ppl), ut you say you r a hindu! How it matters when a black guy invited you to their church? What's wrong in going to church or even burial ground for you modern & trendy hETuvaadis? :)
I am Hindu, but couple of times I visited church and prayed God even. Don't you think yourself as pseudo-hETuwadi? :P
@snkr, I think you are confused, that Krishna and this Krishna is different.
ReplyDeleteఊప్స్ , ఐతే తమరు రెండో కృష్ణుడన్నమాట! ;) సారీ సారీ
ReplyDelete