Tuesday, June 15, 2010

సింహాలూ,చిరుతలూ, యోధులూ, రాజులూ ...

ఆదివారం సాయంత్రం ఒక్క చానెల్ లోనూ సరైన కార్యక్రమం లేదని విసుక్కుంటూ తేజ టీ వీ పెడితే.. క్రికెట్ మాచ్ వస్తోంది. చూస్తే..మన సినీ తారల క్రికెట్ ట.. కాసేపు చూద్దామని కూర్చున్నాం. టీం లని పరీక్షిస్తే...

రాజు గారి పరివారం లో ఆయన గారి ఇద్దరు రాజకుమారులూ, నీలం రంగు యూనీఫాం వేసుకుని మేనల్లుళ్ళిద్దరు.. కలెక్షన్ల రాజు గారి ఇద్దరు కొమరులూ? నయనానందకరం గా అగుపించి.. కప్పు గెలిచారు. సంతోషం. అందరి విషయం పర్వాలేదు.. అఖిల్ గారే సినిమాలో నటించారబ్బా? ఈ మధ్య సరిగ్గా చూడట్లేదు.. నాకు తెలిసి ఆ అబ్బాయి ని 'బేబీస్ డే అవుట్ ' తెలుగు వర్షన్ లో చూసినట్టు గుర్తు.

ఓహో అలాగయితే ఆయనా సినీ తారే.. రాజుల పరివారం బానే ఉంది..

మెగా చీతాలల్లో మిగిలిన తారలు కనిపించలేదు.. గంగిగోవు పాలల్లా ఒక్క రామ చరణ చీతా ఉంటే చాలనుకున్నారేమో.. పవర్ తారలూ, స్టయిల్ తారలూ కనపడలేదు ఎక్కడా.

సిం హా గారొక టీం లో 'చరిత్ర రాసే' వంశం లోని సిం హం పిల్లలు ఇద్దరు ముగ్గురు వేరే టీముల్లో కనిపించారు. ఏదో ఒక టీం లో ఉంటే ఎవరో ఒకరైనా గెలుస్తారేమోననేమో.. పెద్ద సిం హం గారు మాత్రం తమ స్పోర్టివ్ స్పిరిట్ చూపించి.. వేరే టీం వాళ్ళతోనూ సంతోషాన్ని పంచుకున్నారు.

యోధులు రాజుల చేతిలో ఫైనల్స్ లో ఓడినా ఆట సరదాగా ఆడి ఆనందం పంచారు.

కొంతమంది ని గుర్తుపట్టలేకపోయాం ఎవరబ్బా అనుకుంటే.. మాచ్ కామెంటర్లు హీరోలూ/కామెడీ స్టార్ల తమ్ముళ్ళని పదే పదే గుర్తుచేసి.. 'ఓహో ' అనిపించారు.

నాకొక డవుటు.. హీరోయిన్లంటే.. గం నములుతూ, ప్రతి 2 నిమిషాలకీ, మొహమంతా పళ్ళు చేసుకుని 30 డిగ్రీలు ఊగుతూ నవ్వి.. పక్కనున్న ప్రామినెంట్ హీరోల మీదకి వాలిపోతూ, జుట్టుని వెనక్కి తోసుకుంటే .. దాన్నే గ్లామర్ అంటారా?

ఒక కారెక్టర్ ఆర్టిస్ట్.. రాజుగారి పక్కన కూర్చుని ప్రతి 4 కీ, 6 కీ లేచి డాన్స్ చేసి.. ఆరోజుకి ఇంక జింకెళ్ళే బాధ తప్పించుకుంది..

మధ్యలో సాం స్కృతిక కార్యక్రమాలు మాత్రం అదుర్స్! అలా అనగానే గుర్తొచ్చింది. కొత్త పెళ్ళికొడుకు సిం హం రాలేదెందుకో? పోకిరీ గారు ఎప్పుడూ దూరమేననుకోండి.

2 comments:

  1. కొత్త పెళ్ళికొడుకు అంటే NTR యెనా? అతనైతే ఆడాడు.

    ReplyDelete