Thursday, June 17, 2010

మందార మకరంద మాధుర్యమున దేలు ..


మా ఇంటి మందారాల సొగసు చూడ తరమా? -- 18 రకాల మందారాలున్నాయి.. నా చిరు తోటలో.. 9 రకాల పరిచయం ఇక్కడ.. మిగిలినవి తదుపరి టపాలో!


శుక్రవారం పూట తలారా స్నానం చేసి తులసి కోట ముందు నూనూగు ఎండ కి జుట్టారబెట్టుకుంటున్న ఇల్లాలిలా ఈ మందారం..








ఎవరో కథ చెప్తుంటే.. గడ్డం కింద చేయి పెట్టుకుని వింటునట్టుగా లేదో .. ఈ పచ్చ మందారం?












మా అమ్మాయి పూల జడ లా ఎర్ర మందారాలు..










జీవితం లో అన్ని రకాల యెదురుదెబ్బలు తిని విజయం సాధించిన 60 యేళ్ళాయన హుందా తనం నింపుకున్న క్రీం మందారం..







ముప్ఫైల్లో పడ్డ ప్రౌఢ లా పూర్తిగా వికసించిన మరో మందారం!









చిచ్చుబుడ్డి వెలిగించగానే వచ్చిన చమక్కుల వాన లాంటి తెల్ల మందారాల చెట్టు..





పదహారేళ్ళ అమ్మాయి లా నాజూగ్గా, ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టు గా .. కాషాయం రేకు మందారం..







ఒద్దికగా మంగళ స్నానానికి కూర్చున్న పెళ్ళికూతురు లా ఉంది మా వంగపండు రంగు డబల్ మందారం కదూ? కాకపోతే.. పట్టు చీరలూ, నగలూ మిస్సింగ్!!







ఈ నారింజరంగు మందారం అర్థరూపాయ కాసంత బొట్టు పెట్టుకున్న అరవయ్యేళ్ళ పెద్ద ముత్తైదవ లా లేదూ ?








కింద రెక్క కాస్త గడ్డం లా వాలి.. ఈ గులాబీ రంగు మందారం మా వీధిలో ఉండే (పాన్ వేసుకున్న) అన్వర్ సాహెబ్ ని తలపిస్తుంది.












12 comments:

  1. అబ్బ మందారాల మాటేమోగానీ మీ ఊహ(డిస్క్రిప్షణ్) మాత్రం అదిరిపోయింది. అవి చదివాకా ఆ పువ్వులను చూస్తే అచ్చం అలాగే కనిపించాయి. భలే రాసారు...మీ భావన అదుర్స్. మందారాలూ మనసుని హత్తుకున్నాయి.

    ReplyDelete
  2. "ఒద్దికగా మంగళ స్నానానికి కూర్చున్న పెళ్ళికూతురు లా ఉంది మా వంగపండు రంగు డబల్ మందారం."
    ఈ పోలిక చాలా చాలా బాగుందండి. అన్నీ చాలా అందంగా పోల్చారు. ఫోటోలు బాగున్నాయి.

    ReplyDelete
  3. ఠాంక్స్ అమ్మాయిలూ!

    నాకు రోజూ వాటిని చూస్తూ ఉంటే కవిత్వం వచ్చేస్తుంది.
    చెప్పాగా ఇంకా బోల్డు రకాలున్నాయని.. ఇంకో టపాలో రాస్తాను.
    వాటి వివరాలు..

    ఫొటోలు నా సెల్ కామెరా నుండి తీసినవే.. మంచి కామెరా తీసి ముందస్తుగా ఆలోచించుకుని తీసినవి కావు..
    ఈసారి మంచి 12.5 మెగా పిక్సెల్ కామెరా తో తీసినవి షేర్ చేస్తాను..

    ReplyDelete
  4. నిజంగానే మందారాలతో పాటు మీ పోలికలు కూడా అదిరిపోయాయి.. చక్కని పోస్ట్ :)

    ReplyDelete
  5. నాకూ మందారాలంటే చాలా ఇష్టం. అమాయకంగా ఉంటాయి కదా!
    అన్ని పోలికలూ బాగున్నాయి కాని చివరి పోలికే నచ్చలేదు.
    ఏం, తాంబూలం నోటితో భర్త వద్ద వగలు వలక పోస్తున్న జాణలా లేదూ!

    ReplyDelete
  6. మైత్రేయీ,

    :-) మీరు చెప్పిన తర్వాత.. పింక్ మందారాన్ని చూస్తుంటే.. 'భామనే సత్యభామనే ' లో కమల్ తాంబూలం వేసుకున్నట్టుగా ఉంది..

    థాంక్స్!! దాన్ని చూస్తుంటే నవ్వొచ్చేస్తోంది :-))))

    bravO.. MaitrEyi

    ReplyDelete
  7. ఫోటోలు వాటితో పాటు మీ వర్ణనలు కూడా అదుర్స్.

    ReplyDelete
  8. ఒక అనుమానం.పాన్ వేసుకున్నఅన్వర్ సాహెబ్ పువ్వు మగపువ్వా?
    మన సాహిత్యంలో స్త్రీ పురుషులను పువ్వు- తుమ్మెదతో పోల్చారు.కీటకం పువ్వు దగ్గరకొస్తుంది కానీ పువ్వు కీటకం దగ్గరకు పోదు.మేము ఇలాగే వికసించి వాడిపోయి రాలిపోతాము,మాజోలికి రాకండి అంటే కూడా తుమ్మెదలు ఆగటం లేదు.కరుణశ్రీ పుష్పవిలాపం లో అవి జాలిగ నోళ్ళువిప్పి విలపించి,ప్రాధేయపడితే ఆ పూలను కోయకుండా ఒకడు వెనుదిరిగాడు గానీ కీచక కీటకాలు వాటి మొర వినకుండా ఇప్పటికీ బలవంతాన వాలుతున్నాయి.

    ReplyDelete
  9. రహ్మతుల్లా గారు,

    అవును.. పాన్ వేసుకున్న అన్వర్ మియా (మా ఇంటిదగ్గర 70 యేళ్ళ వృద్ధుడు ఆయన.. మాకు చిన్నప్పట్నించీ పరిచయం..) లా అనిపించింది.. అంటే.. కింద ఒక రేకు కాస్త వేలాడుతూ, గడ్డాన్ని తలపించింది. అలాగే క్రీం కలర్ మందారం 60 యేళ్ళ వృద్ధుడిగా ..

    నిజమే మాస్కులిన్ ఫీచర్లు పూలకి ఆపాదించలేదు మన కవులు.. స్త్రీలు, పిల్లలు,వృద్ధులూ, పువ్వుల్లాంటివారే అనిపించింది.. అయితే మైత్రేయి గారి కామెంట్ చదివాక .. తాంబూలం నోటితో భర్త వద్ద వగలు వలక పోస్తున్న జాణలా కూడా అనిపిస్తుంది..

    ReplyDelete
  10. మందారాలూ చాలా అందంగా ఉన్నాయి. ఫొటోలకి మీ వ్యాఖ్యలు కూడా అంతే బాగున్నాయి.Cute! :-)

    ReplyDelete
  11. :-) Thanks Madhuravani! I will do the part 2 soon..

    ReplyDelete