నా చిన్నప్పటినించీ మాలతీ చందూర్ గారి సమాధానాలు చూస్తూనే ఉన్నాను పత్రికల్లో. అప్పుడంతగా ఆలోచించలేదు ఆవిడ గురించి.. ఈ మధ్య మాత్రం స్వాతి పత్రిక లో ఆవిడ సమాధానాలు చాలా ప్రశ్నలకి అసలు పొంతన లేనట్టుగా ఉంటున్నాయి.
అదేదో కథ చెప్పినట్టుగా..
ఒకబ్బాయి ఆవు మీద వ్యాసం మాత్రమే నేర్చుకున్నాడట. పరీక్షలో తాజ్ మహల్ మీద రాయమన్నారట. అబ్బాయి మొదలు పెట్టాడట 'ఆగ్రా లో తాజ్ మహల్ ఉంటుంది. తాజ్ మహల్ పక్కన గడ్డి ఉండును.. ఆ గడ్డి లో ఆవు ఉండును. ఆ ఆవుకి రెండు కొమ్ములూ, తోకా....'
మచ్చుకి మీరే చూడండి.. (25.6.2010 స్వాతి వీక్లీ సంచిక లో పేజీ 56)
ప్రశ్న:
మన దేశం లో ఉన్నన్ని కులాలు, మతాలు మరే దేశం లోనైనా ఉన్నాయా?
సమాధానం :
ఎందుకుండవు? ఉంటాయి. సంపన్న దేశం అమెరికా లోనే ఉన్నాయి. 'మతం' అనే మాటని వ్యవస్థాజనితంగానూ, వ్యక్తిపరం గానూ వాడతారు. 'వాడి మతం వాడిది ' అంటే ఆ వ్యక్తి ఇష్టాయిష్టాకలి సంబంధించిన ప్రవర్తన.
ప్రవక్తలు సన్మార్గమే బోధిస్తారు. వ్యాఖ్యాతలు మాత్రం తమకి అనుకూలం గా మార్చుకుని, శిష్యప్రశిష్యులని తయారు చేసుకుని. స్థానబలిమిని కాపాడుకుంటారు. రాజ్యాంగ శాసనకర్తలు వెనకబడిన తరగతులకి పది శాతం రిజర్వేషనులను కల్పిస్తూ, మనది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి రాష్ట్రాలకు ఆ విషయం లో స్వాతంత్ర్యమిచ్చారు.
సుప్రీం కోర్ట్ యాభై శాతం దాటకూడదని రూలింగ్ ఇచ్చేదాకా రిజర్వేషనుల సంతర్పణం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు. రెడ్లలో, బలిజలలో, నాయుళ్ళలోగల శాఖోపశాఖలు మనై ఆశ్చర్యపరుస్తాయి. ఇక బ్రాహ్మణులలో నియోగా, వైదీకా?, మధ్వులా? తిరుచూర్ణయా? విబుదా?, స్మార్తులా అని ముఖం మీదనే అడిగేవారట.
యేరవతల సంబంధం చేసుకోకూడదనే సంప్రదాయ సరళి గల సంఘం లో అనేకానేక కులాలు ఆవిర్భవించాయి. బ్రాహ్మణులు చేపలు తినటమేమిటని ముక్కు మీద వేలేసుకుంటారు. కాని బెంగాల్ లో వారికవి జలపుష్పాలు. ప్రస్తుతం మన దేశం లో మూడువేల కులాలు ఉన్నాయంటారు గణాంక లెక్కలు చెప్పేవారు.
Friday, June 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రవీణ్ శర్మ కి చుట్టాలేమో ?
ReplyDeleteఖచ్చితంగా ప్రవీణ్ శర్మ కి చుట్టాలే
ReplyDeleteమార్తాండ మరో పదేళ్ళలో స్వాతి డైలీ లో నన్ను అడగండి సీర్శికలోకి వేల్లిపోతాడా
స్వాతి పత్రికని ఆ భగవంతుడే కాపాడాలి
ప్రవీణ్ శర్మ అయితే మిగతా కధలు,కామెడీ, మా శ్రీకాకుళం కధలు, సైన్సు కబుర్లు గట్రా వేరే రచయతలకు డబ్బులు ఇవ్వాల్సిన పని కూడా ఉండదు
నేను కూడా గమనించానండీ. మొదట్లో ఆసక్తిగా చదివేదాన్ని, కానీ రాను రాను మీరు చెప్పినట్టు ప్రశ్నలు, సమాధానాలు ఏమాత్రం పొంతన లేకుండా ఉంటున్నాయి. అసలు ఆవిడే రాస్తున్నారో, ఆవిడ పేరు మీద వేరే ఎవరైనా రాస్తున్నారో అన్నట్టుగా ఉంది ఈ మధ్య కాలం లో ఆ శీర్షిక.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteనేనూ గత 5-6 యేళ్ళుగా ఇదే మాటనుకుంటున్నాను. ఈవిడేమిటి ఇలా తలాతోక లేని సమాధానలు చెప్తున్నారు అని. ఆ జవాబుల్లో అస్సలు అర్ధంపర్థం ఉండదు. పురాణాల గురించి అడిగితే ఫేస్ పౌడర్ గురించి అడిగితే పక్కింటివాళ్ళ గురించి చెప్తున్నట్టుంటాయి.
ReplyDeleteI read Malathy Chandur`s answers now & then.
ReplyDeleteBut i dint find much mistakes.
Her answer which is published in this blog is
ridiculous.
This comment has been removed by the author.
ReplyDeleteఅది సీనియరిటీ వల్ల వచ్చిన నిర్లక్ష్యం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి! గొప్ప రచయితలు,(నిజంగా ఆమె గొప్ప రచయిత్రి, ఆమె కలెక్షన్ అంతా నా దగ్గరుంది) ఏం రాసినా జనం చదివేస్తారన్న భావం!
ReplyDeleteఈ మధ్య మరీ పొంతనలేకుండా ఉంటున్నాయి ఆమె సమాధానాలు!
@READERS
ReplyDeleteIts true..
Just now i have bought SWATHI(25-6-10).
Her answer in LITERATURE CATOGORY..is very very
unrelated.
QUESTION IS:- ARE THERE ANY NOVELISTS SIMILAR
TO "SHARATH CHANDRA"?
ANSWER:- She has not given answer? Just she
praised Mahswetha Devi garu..
సౌమ్య గారూ,
ReplyDeleteచాలా సార్లు నేనిలాగే అనుకుని.. ఆవిడ పెద్దావిడ.. జ్ఞానవంతురాలు అనుకుని ఆవిడ ప్రశ్న చదివాక వచ్చిన ఆలోచనలని రాస్తున్నారేమో అనుకున్నాను..
అవును సుజాత గారూ,
సీనియారిటీ వల్ల వచ్చిన నిర్లక్ష్యం కావచ్చు. ఇదే ధోరణి మనం సినిమా హీరోల్లో కూడా గమనిస్తాం కదా.. :-)
ఎలా చేసినా చెల్లుతుంది అని..ఎంత చిన్న హీరోయిన్ తో.. స్టెప్పులేసినా చూసి తరిస్తారని..
రాం నర్సిం హ గారు,
Thanks!
సమస్యలు చెప్పుకుంటే సమాధానాలు క్లుప్తంగా స్పష్ఠంగా ఇస్తారు.. మిగిలిన వాళ్ళల్లా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అనకుండా, Which is good, కానీ తనకి తెలిసిన విషయాలే చెప్తారు, పాఠకులేమడిగినా..
పైన ఎవరో చెప్పినట్లుగా ప్రస్తుతం సమాధానాలిస్తున్నది
ReplyDeleteమాలతీ చందూరు గారు అయి ఉండకపోవచ్చును..
ఒకో సారి విషయం నుంచి deviate అవ్వడం పెద్ద position లో వున్న వాళ్ళ దగ్గర చాలాసార్లు గమనించా... ఇట్స్ నేచురల్ ..ofcourse..
ReplyDeleteమాలతి చందూర్ గారి సంగతేమో కానీ ఇక్కడ కొంత మంది ఎప్పుడు వీలు దొరుకుతుందా ఆ మార్తాండ ని ఆడిపోసుకుందామని కాచుకూచుంటారు.దేని గురించి రాసినా కామెంటు మాత్రం ఆ మార్తాండ కి లింకెట్టి కామెంటుతారు.
ReplyDeleteబ్లాగుల్లో కవిత,కధ,విశ్లేషణ ఏదయినా కానీ వారి కామెంటు మాత్రం ఒక్కటే.
@ పై అజ్ఞాత మీకు మార్తాండ మీద బాగా లవ్వు ఎక్కువైనట్టు ఉంది
ReplyDeleteమాలతి చందూర్ గారితొ స్వల్ప పరిచయం ఉన్న వ్యక్తిగా వ్రాస్తున్నాను. ఎవరో చెప్పినట్లు ఇతరుల సాయంతో ,1995లో ఏదో సంగీత కార్యక్రమనికి వచ్చారన్నది (రెక్కలు పట్టుకొని తీసుకుని వచ్చారు, పండుటాకులా ఉన్నారు) నిజంకాదు. రచయితకీ పాఠకులకీ మధ్య అంతరం ఉంటేనే బాగా ఉంటుందని, లేకపొతే రచయిత గురించిన ఊహా చిత్రం చెదిరి పోతుందని ఆమె అభిప్రాయం. గత ఏడాది సాహిత్య అకాడెమి చెన్నైలొ ఏర్పాటు చేసిన Meet the Authour ప్రొగ్రాములో ఆమె పాల్గొన్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకి చక్కగా సమాదానాలు ఇచ్చారు.
ReplyDeletehttp://malatichendur.com
this is her website.