Sunday, June 20, 2010

మోరీలు కడిగే రాములూ - ముకేశ్ అంబానీ

ఈరోజు ఈనాడు ఆదివారం అనుబంధం లో నీతా అంబానీ (భారతదేశం లో అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ గారి భార్య) తో ఇంటర్వ్యూ లో ఆవిడ చెప్పిన విశేషాలు వింటే .. మా మోరీ రాములు భార్య జీవితం గుర్తొచ్చింది :-) రాములు మోరీలు కడుగుతాడు, సెప్టిక్ ట్యాంకులూ అవీ క్లీన్ చేయటం.. అవీ చేస్తాడు.

27 అంతస్థుల మేడలో ఆరు వందల నౌకర్లూ,చాకర్లూ, స్విమ్మింగ్ పూలూ, నాలుగంతస్థుల కార్ పార్కింగూ, కట్టించారట ముకేష్ అంబానీ గారు.

మా రాములు 700 రూపాయల అగ్గిపెట్టె లాంటి చిన్న అద్దింట్లో .. తల్లీ, ముగ్గురు పిల్లలూ, భార్యా కాక, తమ్ముడూ,మరదలూ,వాళ్ళ కొడుకూ కూడా ఉంటారు. అత్తగారూ కోడళ్ళూ తెగ అరుచుకుని, కొట్టుకుని,కొప్పులూడేలా తన్నుకుంటారు రోజూ.. మర్నాడు పేలు చూసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు.

రాత్రి 10-11 గంటలకి ముకేశ్ ఇంటికొచ్చాక కలిసి తింటారట. భర్త గారు సజ్జ రొట్టే, ఉల్లికూరా.. నీతా గారు కూరముక్కలూ, పళ్ళూ,సూపులూ తప్ప అన్నం, చపాతీలూ ముట్టదట. 90 కిలోలనుండీ.. 47 కిలోలకి రావాలంటే ఈ త్యాగాలు తప్పవు కదా పాపం! కార్ లో మాత్రమే విరామం దొరుకుతుందిట. అప్పుడే ఆవిడ కునుకు తీస్తారుట.

రాములు కుటుంబం ఉదయం చద్దన్నం, తొక్కూ, ఉల్లిగడ్డా, ఏదుంటే అది.. మధ్యాహ్నం పని అయ్యాక నీళ్ళుంటే స్నానం చేసి మళ్ళీ అన్నమో రొట్టో, కారం తో.. తినగానే కంటినిండా నిద్రా.. సాయంత్రం మళ్ళీ చిల్లర పనులకోసం తిరగటం, ఎంత సంపాదన ఉంటే అంత, తినటమూ, తొంగోటమూ..

10 comments:

  1. గొప్ప వాళ్ళు తిన్నా, తినకపోయినా వార్తే. మనం ఉన్నది వాళ్ళగురించి రాసే సొల్లు వినడానికే. మీ మోరి రాము గురించి రాయమనండి చూద్దాం

    ReplyDelete
  2. Inthaki meeru em cheppalani anukuntunnaro okka

    mukka artham kaledu..Can u give clarification?

    His name is Ramu..How can u say Mori Ramu?

    Evaryna meeku nick-names pedithe meeru

    oorukuntara?

    ReplyDelete
  3. This article is very very ridiculous..

    ReplyDelete
  4. వీరె కాదు మీడియా వారు ఎలెక్షన్ సమయంలో నాయకుల రోజువారి దినచర్యలు చూపిస్తారు. అప్పుడు మన ప్రముఖ నాయకు లందరు ఉదాయాన్నే లేచి యోగా చేసి ఒక రొట్టె, ఆరెంజ్ జ్యూస్, నాన బెట్టిన శనగలు ఇటువంటి వి తింటారు. మధ్యహ్నం రెండు రోటిలు పెరుగన్నం రాత్రికి రెండు పుల్కాలు తింట్టారు. ఈ మాత్రం తిండి తిని సింపుల్ గా ఉండే వారికి అన్ని కోట్ల డబ్బు ఎందుకు

    ReplyDelete
  5. కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోలేనివాడు కోట్లు గడించితేనేమి, కుటుంబంతో గడపలేనివాడు కుబేరుడైతేనేమి అని మీ భావమని తోస్తోంది. నిజమే మరి!

    ReplyDelete
  6. రామ నర్సిం హ గారూ,

    మీ అభిప్రాయం కామెంట్ రూపం లో ఇచ్చినందుకు ధన్యవాదాలు!

    మొదటగా 'మోరీ రాములు ' పేరు గురించి..

    మీరన్నది నిజం. సారీ.. కాకపోతే.. ఒక శనివారం ఉదయం వేళ గేట్ కొట్టి 'నా పేరు మోరీ రాములు.. మీకేమైనా సెప్టిక్ టాంకులూ,మోరీలు కడగటం లాంటి పనులుంటే చెప్పండి ' అని చేసుకున్న పరిచయం బేసిస్ మీద, గత 15-20 యేళ్ళు గా ఆయనని అదే పేరు తో వ్యవహరించటం అలవాటైపోయింది.

    పిలవటం రాములు అయినా,.. మా ఏరియా లో ఎవ్వరికైనా 'మోరీ రాములు ' అంటేనే తెలుస్తుంది.

    సింధీలో ఎవరో.. 'డబల్ రోటీ రోటీ వాలా, హంటర్ వాలా, టేబల్ వాలా ' అన్న సర్ నేం లు మనం చూస్తూనే ఉంటాం.. వాళ్ళ్ వృత్తుల్ల ఆధారం గా ఏర్పడిన ఇంటి పేర్లవి.

    ఏది ఏమైనా.. ఈ టపా ద్వారా, ముఖ్యం గా మీ కామెంట్ ద్వారా నేను నేర్చుకున్న విషయం..

    పాపం రాములు, తన పరిచయం మోరీ పేరు తో కలిపిచేసుకుంటున్నాడు.. అలా అని నేను కూడా ఆ రిఫరెన్స్ వాడాలనేముంది? టపా ఎడిట్ చేసి 'మోరీ రాములు ' ని 'మోరీలు కడిగే రాములు ' గా మార్చాను..

    ReplyDelete
  7. రామ నర్సిం హ గారూ,

    ఇక కంటెంట్ విషయానికొస్తే.. ఇంచుమించు గా చదువరి ,శ్రీనివాల్ అభిప్రాయం తో రాశాను. ఇంకా చాలా చాలా కోణాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాను..


    రాములి జీవితం దారిద్ర్య రేఖ కి కింద, మరి అంబానీ జీవితం సంపన్న రేఖ (నా ఉద్దేశ్యం.. ఇంత కన్నా ఎక్కువ సంపాదిస్తే.. సంపన్నులని) దాటి ఇంకా పై అంచు ని దాటుతూ..

    రాములికి మౌలిక సదుపాయాలు తిండి,బట్టా, గూడూ సాధ్యమౌతున్నాయా?
    తిండి, బట్టా పర్వాలేదు. గూడు కష్టమవుతోంది. ఆయన కుటుంబం రోజూ వీటికోసం పోరాటం లోనే గడిచిపోతోంది.

    అంబానీలు వీటిని జయించటమే కాక కొన్ని వేల మందికి పని ఇచ్చి వాళ్ళ జీవితాలు మెరుగు పెట్టగలుగుతున్నారు.
    అయితే అన్ని వేల కోట్లున్నా.. వేరే అవసరాలైన కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర నోచుకోలేకపోతున్నారేమో..

    మా రాములు తల్లి కి 70+ ఆవిడ 5 యేళ్ళక్రితం డాక్టర్ దగ్గరకెళ్తే.. పెద్ద దానివయ్యావు ఇంక అరగదు. మూడో పూట మానేయ్ అన్నాడట.

    అంబానీలు వేలాది కోట్ల ఆస్థి ఉన్నా కంపెనీ ని చీల్చి,.. గాస్ కోసమో, ఇంకోదేనికోసమో కొట్టుకుని, ,తరచూ మీడియాలో కెక్కుతూనే ఉన్నారు. రాములి కుటుంబం, రోజూ కొట్టుకున్నా, కలిసే ఉన్నారు.

    Money makes life complicated. ఒక ఫ్రెండ్ చెప్పింది ఒకసారి 'డబ్బు లేకపోతే.. ఒక చీర కావాలి వొళ్ళు కప్పుకోవటానికి. ఉన్నవాళ్ళకి పాపం కాంప్లికేటెడ్ జీవితం. కంచి,ధర్మవరం, బెనారస్ పట్టులే కాక .. డిజైనర్ వేర్ కట్టాలి, ఒకేషన్ కి తగ్గట్టు కట్టాలి, చుట్టూ ఉన్నవాళ్ళని గమనించి మరీ.. అందరికన్నా ఒక మెట్టు ఎక్కువ గా ఖరీదు ఉండాలి, ఫాషన్లు పాటించాలి, ఆక్సెసరీస్ మళ్ళీ ఉండాలి..'

    ReplyDelete
  8. చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  9. Naa abhiprayanni kontha varaku artham

    chesukunnaru..

    Still i am not satisfied..

    Reply ivvadam mee "vishala drukpadanni"

    teliyajesthondi..

    This is my last comment on this issue..

    Yours sincerely

    ReplyDelete
  10. అంటే తినటం ఒక్కటే కాదు కదా జీవితాశయం. ప్రత్యేకం గా అంబాని కుటుంబం అంటే ఏమో నో కామెంట్ కాని, ఏదో సాధించాల తనకంటూ ఒక గుర్తింపు వుండాలి అనే ఆలోచన దానికోసం నడక మానవ సహజ లక్షణమేమో కదా. రాము ఎంత అవసరమో అంబాని అంతే అవసరం కదా సమాజానికి.

    ReplyDelete