Thursday, June 24, 2010

అత్తాకోడళ్ళ సంవాదం..

మా ఫ్రెండ్ అత్తగారు అమెరికా కెళ్ళింది. ఇద్దరు కొడుకులిళ్ళల్లో ఇంచుమించు గా ఒకే పరిస్థితి. భార్యా భర్తలు అన్నీ కలిసే పని చేసుకుంటున్నారు. ఆవిడ కి కాస్త బాధనిపించింది. పాత కాలం ఆవిడ కదా..

ఆవిడ తెలుగు టీచర్! వెరైటీగా ఆవిడ ఆక్రోశాన్ని వచన కవిత్వం గా ప్రకటించారు.

పాలలో మురిపాలు కలిపి,
కారం లో మమకారం వంపి,
అరిచేతులని పాదాల కింద నిలిపి
ఎంతో ప్రేమగ పెంచితి,

(కానీ..ఈరోజున)

కోడళ్ళకి టీలందించి,..
వంటలు వండి, బట్టలుతికి, (లాండ్రీ లో బట్టలు వేయటం అని ఆవిడ భావం)
ఆమెర(రి)కన సుఖపడుదరని పెండ్లి చేసి పంపితి..
తండ్రులారా, మీ కష్టం నే చూడజాల!
..

ఈ కవితలని తెలిసిన వాళ్ళకి చూపి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసు కోవటం తో కోడలు పిల్లకి మండింది. అదేమని దెబ్బలాడితే.. చాతనైతే.. పద్యరూపం లో సమాధానం ఇవ్వమని చాలెంజ్ విసిరింది అత్తగారు. కోడలు తక్కువదా..ఆవిడా స్వీకరించి ఇలా రాసింది..

వచ్చితిమేమత్తింటికి పుట్టింటిని వీడి పెక్కు యాశలతోడన్..
తెచ్చితిమేమింట వెలుగు, మెచ్చుచు మా భర్తలు కడు డెందము మీరన్,
ముచ్చట పడి ఇంటిపనులు, మురిపముగ చేయబూన ముందుకు రాగా..
రచ్చన ప్రకటించి నీవు పరిహాసం చేయబూన తగునే యత్తా?

అత్తగారు ఎంతైనా టీచర్ కదా, కళ్ళజోడు పెట్టుకుని చందస్సు దిద్దటం మొదలు పెట్టేసారు వెంటనే... సెభాష్ కోడలా అంటూ

4 comments:

  1. ఏమిటండీ మళ్ళీ పెట్టారు? మా కామెంట్లన్నీ ఏమయినాయి?

    ReplyDelete
  2. comments teesEsi maLLee pOsT chEsaavE..

    ReplyDelete
  3. ఓ ఇప్పుడర్థమయింది విషయం....సరే నా కామెంటు మళ్ళీ రాస్తాను

    అబ్బ కోడలి పద్యం ఎంత బావుందండీ...అత్తగారి పద్యంలో అంత పసలేదు గానీ కోడలి పద్యం మాత్రం సూపరు, కేక...భలే రాసారు.

    ReplyDelete
  4. ఓ ఇందులో కామెంట్స్ తీసేసారా ? పోనీలెండి మళ్ళీ రాస్తాను .
    ఈంతకు ముందు ఏమ్రాసానబ్బా ?? ఆ గుర్తొచ్చింది , నేనూ నా కోడలు ఇలాగే సరదగా వుంటాము .

    ReplyDelete