
ఎవరో నాకీ విత్తనాలిస్తే ఏవోలే అని వేశాను. నెల తర్వాత.. ప్రతిరోజూ ఒక అద్భుతం నా ఫ్రంట్ యార్డ్ లో..
సాయంత్రం 4.30-5.00 గంటల మధ్య చందమామ పలకరించగానే విరిసి, తెల్లవారేసమయానికి ముడుచుకునే పూలివి...
సాయంత్రం 4.30-5.00 గంటల మధ్య చందమామ పలకరించగానే విరిసి, తెల్లవారేసమయానికి ముడుచుకునే పూలివి...
నెలరాజునలరించటానికే వీటి జన్మ, ఆయన కి వీడ్కోలు చెప్పే ముందే ఎడబాటుని తట్టుకోలేము, అన్నట్టు ముందు గానే నిష్క్రమిస్తాయి..
కలువ పూల మొగ్గ లా ఒక మెగా సైజ్ సన్నజాజి లా సుకుమారం గా ఉంటాయి మొగ్గలు. మనం దాని వైపు చూస్తూ ఉండగానే.. 'ఠప్ప్ ' మని అరచేతి పరిమాణం లో విచ్చుకుంటాయి. ఈ విన్యాసం జరగేది జస్ట్ .. అర సెకన్ వ్యవథి లో.. తెల్లవారాక దాని అవశేషం తప్ప ఏదీ ఉండదు చూట్టానికి..
చిత్రంగా ఉందే! ఈ మొక్క పేరేంటో చెప్పగలరా వీలైతే!
ReplyDeleteమధురవాణి గారూ,
ReplyDeleteవీటిని ఆంగ్లం లో మూన్ ఫ్లవర్స్ అంటారు.. వీటినుండి వచ్చే పరిమళం మొత్తం గార్డెన్ ని నింపుతుందన్నారు కానీ..అంత లేదు ..
http://www.theflowerexpert.com/content/aboutflowers/tropicalflowers/moon-flower
one month lone vittanam nunchi intha pedda mokka ayyinda? you must be real good at gradening.
ReplyDeletevani, the flower itself is called moon flower. it is kind of opposite to morning glory, which blooms with sunrise and dies by afternoon.
రాణి గారూ,
ReplyDeleteచందమామ పూలు తీగలు చాలా తొందరగా పెరుగుతాయి. విత్తనం నాటేముందు మాత్రం రాత్రంతా నానబెట్టి ఉదయం వేస్తే..ఆ పూటే మొలక వచ్చేస్తుంది.
బెంగుళూర్ వాతావరణానికి ఇది చాలా ఫాస్ట్ గా ఎదుగుతుందనుకుంటా.
intaku mundeppudoo choodaledanukunta.. baagunnai..
ReplyDeleteచాలా అందంగా ఉన్నాయండీ ఈ పూలు. మీ వివరణ ఇంకా బావుంది.
ReplyDeleteఇలాంటి పూలని రోజూ ఇంట్లో చూడటం భలే హాయినిస్తుంది కదూ