Thursday, June 24, 2010

అజ్ఞాత, శరత్ 'కాలం', మాలిక నిర్వాహకులు ఏకలింగం గారూ,

అజ్ఞాత,
తెలుగు బ్లాగు మొదలు పెట్టిన 15 రోజులకే కామెంట్ మోడరేషన్ అవసరాన్ని అర్థమయేలా.. కామెంట్లు విడిచినందుకు!

శరత్ 'కాలం' గారికి,
మీ టపా చూసిన తర్వాతే నా బ్లాగ్ కామెంట్లు చూశాను. వెంటనే పోస్ట్ తొలగించాను.. కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేసి మళ్ళీ ప్రచురించాను.
మీ టపా కీ, టపా లో చూపించన సపోర్ట్ కీ కృతజ్ఞతలు.

మాలిక నిర్వాహకులకి,
ప్రత్యేక ధన్యవాదాలు! కామెంట్లు తొలగించినందుకు!

6 comments:

  1. మేము మాత్రం మసాలా మిస్ అయ్యామ్..pchhh...

    ReplyDelete
  2. నా టపా మీకు ఉపయోగపడ్దందుకు సంతోషంగా వుంది.

    ReplyDelete
  3. అమ్మడూ
    నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. నీ బ్లాగులలో ఏమీ ప్రత్యేకత వుండదనీ, మనుషుల మనసులని మెచ్చుకునేలా ఇంకా నువ్వు రాయగలిగేంత పరిపక్వత నీకు లేదనీ . నీ బ్లాగులో కామెంట్లు రాసేవాళ్ళంతా నువ్వు రెగులర్ బ్లాగర్వి కనుక నీ బ్లాగులో కామెంట్లు బ్లాగు అగ్గ్రిగేటర్ల దృష్టిలో పడి వాళ్ళ బ్లాగులకి హిట్లు పెరుగుతాయి అని నీకు ఎప్పుటికి అర్ధముతుందో.. పనిలోపని ఇక్కడ కొన్ని కరడుగట్టిన స్త్రీవాద దిగ్గజాలున్నాయి, దారినపోయే దానమ్మ ఏమి కారు కూత కూసినా "ఆహా వోహో .. అని పొగిడెయడం వారి వారి ప్రవృత్తి ధర్మం. సొ దయచేసి ఈ అధికప్రసంగం ఆపేయ్ ..

    మరో మాట శరత్ నిన్నేదో ఉద్ధరించడానికి రాయలేదా బ్లాగును .. ఆయనకి తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక్క పదాన్ని ఎవరో సరిగ్గ కనిపెట్టేసారని ఉక్రోషం .

    అనువుగాని చోట అధికులమనరాదు అమ్మడూ .. కాస్త తెలుసుకో ..

    ReplyDelete
  4. బ్లాగు పిచ్చి జనులకు ఈ రేంజ్ లో ఉందని నాకు తెలీదు, హిట్లు ,కామెంట్లు, స్పందనలు,మనసులకు హత్తుకోవడాలు మన్ను మశానం.హిట్లు వస్తే ఈనాడు లో ప్రకటనలు ఇచ్చి ఏదైనా శాలువా కప్పుతారా? 1000 కామెంట్లు వస్తే బ్లాగు బ్రహ్మ అని బిరుదులిస్తారా?వచ్చినా అవి దేనికైనా ఉపయోగ పడతాయా?మా నాటు భాషలో చెప్పాలంటే చేతికి దురద పెట్టి మనకున్న పిచ్చిని నలుగురికీ తెలిసేట్టు చేయడమే బ్లాగు రాయడం, ఎవరికి నచ్చినా నచ్చక పోయినా మనకు వచ్చేది లేదు పోయేది లేదు. ఈ మాత్రం దానికి ప్రతి ఒక్కరూ ఉచిత సలహాలు ఇవ్వడమే నీలో పరిపక్వత లేదు తొక్క లేదు అని.మరి ఇక్కడ అందరు తెలుగులో బ్లాగులు రాసి తెలుగు సాహిత్యాన్ని ప్రపంచం మొత్తం మారు మ్రోగిపోయేట్టు ఉద్దరిస్తున్నారా?

    ReplyDelete
  5. Anonymous gaariki,

    ఊర్కే చిన్న చిన్న విషయాలు రాయటానికి పెద్ద ప్రత్యేకత, అంత పరిపక్వత అవసరం లేదేమో.. మనుషుల మనసుల్ని మెచ్చుకునేలా రాయటం.. నేర్చుకుంటాను నెమ్మది నెమ్మది గా .. జన్మంతా బ్లాగ్ రాసినా నేర్చుకోలేకపోయినా నష్టం లేదు.

    ఇక కామెంట్లంటారా.. కొంతమందికి నచ్చుతుంది.. కొంతమంది కి నచ్చదు. కొంతమందికి ఓపిక ఉండదు..కొంతమంది ఓపిగ్గా,ఎంకరేజింగ్ గా కామెంట్ ఇస్తారు. కొంతమంది మీలాగా కూడా..

    ధన్యవాదాలు!

    Venkat!

    Thanks a lot for your comment.

    ReplyDelete
  6. కొత్తగా బ్లాగు రాసే వాళ్ళని ఇంతకు ముందు ఒరిజినల్ ఐడి లతో ర్యాగింగ్ చేసే వారు. ఇప్పుడు అజ్ఞాతంగా చేస్తున్నారు. ర్యాగింగ్ మాత్రం ఆపడం లేదు. అది మనం ర్యాగింగ్ అనుకోకుండా కామెడీ గా తీసుకుంటే సరి.

    ReplyDelete