Monday, August 2, 2010

పిల్లల న్యూస్ లో పెళ్ళిళ్ళూ, గృహ హింస, బిపాషా, రణబీర్ వార్తలు!!


టైంస్ ఆఫ్ ఇండియా వారి స్టూడెంట్స్ ఎడిషన్ చూసి తీరాలి. మా అపార్ట్ మెంట్ లో పాప చేతిలో చూశాను. వాళ్ళ స్కూల్ లో బలవంతం గా అందరిదగ్గర నుంచీ సంవత్సరానికి చందా కట్టించుకున్నారట.
ఏం ఉంటుందో చూద్దాం అని సరదాగా అడిగి తీసుకున్నాను.

మొదటి పేజీ..
ఎడమ పక్క అమీర్ ఖాన్ 8 నెలల నుండీ సినిమాలు చేయట్లేదని కుడి పక్క రాహుల్ మహాజన్ పెళ్ళాన్ని కొట్టాడని వాళ్ళావిడ ఫొటో..
సగం పేజీలో క్లింటన్ల పాప చెల్సియా పెళ్ళి విశేషాలు..కింద పావు పేజీ లో ధోనీ దంపతులు తాజ్ సముద్ర కి వెళ్తే.. అక్కడ వాళ్ళావిడ షెఫ్ ని అడిగి ఆవిడే వండిందిట ఆ వార్త.

రెండవ పేజీ:కింద సగం పేపర్ రాహుల్-డింపి దంపతుల తగాదా, మళ్ళీ కలిసిపోవటం.., చెల్సియా పెళ్ళి విశేషాలు.
మూడవ పేజీ వదిలేస్తే..నాలుగవ పేజీ పూర్తిగా చెల్సియా పెళ్ళి ఫొటోలు, పెళ్ళి గౌను, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారో.. పూర్తిగా డెడికేట్ చేశారు!

ఆఖరి పేజీ లో పావు భాగం..బిపాషా కారీర్ లో పదేళ్ళ పూర్తి, రణబీర్ గిటార్ వాయించటం గురించి, కాజోల్ మళ్ళీ భర్తతో ప్రేమలో పడిందిట

మిగిలిన పేజీలు ఓకే..
ఇవీ ఐదవ తరగతి చదివే పాప కి స్కూల్ వాళ్ళు కొనిపించి ఇచ్చిన దినపత్రిక లో విశేషాలు..

12 comments:

  1. మీరు అసలు పాయింట్ మిస్ అయ్యారు
    స్కూల్ అయ్యాక లైన్ లో నిలబడి యి పేపర్ కలెక్ట్ చేసుకోవాలి .
    యి లోపు చందా కట్టని పిల్లలు ఆటో వాణ్ణి
    పోదాం ఆన్కుల్ ఆకలి వేస్తోంది అంటే వాడేమో
    మీ అబ్బాయి వల్ల మిగతా పిల్లలకి లేట్ అవుతోందని కంప్లైంటు
    యి బాధ పడలేక చందా కట్టడమే గాని పేపర్ కలెక్ట్ చేసుకోవటం లేదు .
    దీని కన్నా స్కూల్ వాళ్లే క్లాసు రూం లోకి తెచ్చి ఇవచ్చు కదా,

    ReplyDelete
  2. రాణీరత్నప్రభ గారు చితకేసారండీ ! :)

    ReplyDelete
  3. చివరకు ఇలా దిగజారిందన్నమాట Times of India పరిస్థితి.అయినా ఎవరూ అడగరా ఇదేంటని?

    ReplyDelete
  4. @ రవిగారు,

    :-) నిజం. అంతే కాదు..
    స్కూల్ యాజమాన్యం ఈ మధ్య మీరు స్పేస్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటే.. తప్పని సరి గా మూడు వేలు కట్టి ఈ కోర్స్ లో చేరాల్సిందే.. రెండున్నర వేలు కడితే లాజికల్ థింకింగ్ నేర్పిస్తాము అనీ పీకేస్తున్నారు. పిల్లలు ఇంటికొచ్చి తల్లిదండ్రులని ముప్పు తిప్పలు పెట్టటం..

    ReplyDelete
  5. @ రాజేంద్ర కుమార్,
    :-)
    @విజయమోహన్,
    మంచి సైంటిఫిక్ విషయాలు, ఆడ సీ ఈ ఓ ల ఇంటర్వ్యూలూ, వివిధ స్కూళ్ళళ్ళో ఏమవుతుందో చెప్తారు ఈ పేపర్ లో.. కానీ మరీ చెల్సియా పెళ్ళి గౌనుకి 10,000, టెంపరరీ టాయిలెట్లు పెట్టటానికి 15,000, కాజోల్ మళ్ళీ భర్త తో ప్రేమ లో పడటమూ, ధోనీ వాళ్ళావిడ ఏం చేసి పెట్టింది భర్తకి, డింపి ని భర్త ఎక్కడ కొట్టాడు.. అసలేం జరిగింది? ఇలాంటివి చిన్నపిల్లల వార్తలు గా ప్రచురించటం.. పైగా దాదాపు 2 పేజీలు దీనికే డెడికేట్ చేయటం!!

    చాలా దురదృష్టకరం!

    ReplyDelete
  6. కేక, చాలు పేపర్ నడాటానికి ఇంకేమి కావాలి.
    జాతీయ మీడియా మొత్తం ఇలానే తగలడింది, హిరోయిన్ కుక్క ఈనితే మొడటి పెజీ, మన్మోహన్ తుమ్మితే మొడటి పేజీ...
    అభిషేక్, ఐశ్వర్య పెళ్ళి గురించి అన్నీ మొదటి పెజీలో మొత్తం పెజీనో, కనీసం సగం పెజీ పైనే రాసాయి, ఒక్క ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాత్రమ్ చిన్న బాక్స్ ఐటం ఇచ్చింది, మన తెలుగు మీడియానే కొంతలో కొంత బాగున్నాయి.

    ReplyDelete
  7. ఆంధ్రా లో times of india DC
    compitition కోసం viewership దృష్టి లో పెట్టుకొని రాస్తున్నరేమో
    నిలదొక్కుకోవాడానికి కూడా ఒక కారణం కావచ్చు
    మెట్రో లో జనరల్ గా seperate addition ఉంటుంది కదా సినిమాలు పార్టీ లు కోసం

    indian express,హిందూస్తాన్ టైమ్స్ ఇప్పుడు కాస్త బెటర్ ఉన్న వాటిలో
    DNA కూడా క్వాలిటీ తగ్గించేసాడు
    తార చెప్పింది సబబు గా ఉంది

    ReplyDelete
  8. హయ్యో ఇది ఇప్పుడేమిటండీ టైంస్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ఇలాగే తగలడింది. ఎప్పుడూ దిక్కుమాలిన సినిమా కబుర్లేగానీ పనికొచ్చే విషయాలు ఒక్కటి ఉండవు. ఎంతసేపు ఐస్వర్యా రాయ్ ఏ గౌను వేసుకుంది, షారుఖ్, పెళ్ళానికి ఏం గిఫ్ట్ ఇచ్చాడు. కరీనా కాపురూ ఇవాళ ఏం తింది. అభిషేక్ బచ్చన్ చిన్నప్పుడు అల్లరి చేసేవాడా...ఈ సోది తప్ప ఇంకేమీ ఉండదు. అందుకే నేను ఎప్పుడో టైంస్ ఆఫ్ ఇండియా చదవడం మానేసాను.

    నేను చూసిన అతి దరిద్రమైన పేపర్లలో హిందుస్తాన్ టైంస్ ఒకటి. చెప్పాలంటే అదే నెంబర్ వన్. నిజంగా మీరు నమ్మరు గానీ దానిలో మొదటి పేజీ నుండి, చివరి పేజీ వరకు సినిమా కబుర్లు, ఏడ్స్, అల్లక్కడ ఈ షాపులో ఇవి అమ్ముతున్నారు. అదెక్కాడో అమాయిలకి ఈ డ్రెస్సులు బావున్నాయ. ఇల్లిక్కడ అబ్బాయిల జీన్స్ బావున్నాయి. ఈ చెత్త కబుర్లే తప్ప న్యూస్ ఏమీ ఉండదు.

    అన్నిటికన్నా బెస్ట్ హిందూ నే. కాస్త బయాస్డ్ గా ఉన్నా అదే బెటర్.

    తార చెప్పినట్టు తెలుగు మీడియా చాలా బెటర్. ఆ కబుర్లకంటూకంటూ ఓ పేజీ కేటాయిస్తారు.

    ReplyDelete
  9. హిందూ పేపర్ ముంబై లో రాదు
    ఢిల్లీ లో అన్నీ పేపర్లు అలానే తగలడతాయి
    కావాలంటే తార ని అడగండి

    ReplyDelete
  10. పెద్దవాళ్ళు చదివే వార్తా పత్రిక ని ఎలాగ నడిపినా కనీసం చిన్న పిల్లల కోసం ప్రత్యేకం గా ప్రచురించే స్టూడెంట్స్ ఎడిషన్ లో కూడా ఇవే బాధ్యతారహితం గా వేస్తే.. భావి తరం చిన్నప్పట్నించీ ఇవే చదివి పెద్దయ్యాక వాళ్ళ రెగ్యులర్ పేపర్ కి రెడీ అవుతారనేమో!

    కాజోల్ మళ్ళీ భర్త తో ప్రేమ లో పడింది.. లేక ధోనీ భార్య ఏం వండి పెట్టింది? ఇలాంటి చెత్త న్యూస్.. అన్నది ఐదవ తరగతి పిల్ల చదవాల్సిన వార్తలు అని టైంస్ యాజమాన్యం అభిప్రాయం కాబోలు..

    ReplyDelete
  11. "హిందు" పేపర్లో ఇలాంటి వార్తలు ఉండవు.
    అయినా ఎవరూ చదవరు.

    ReplyDelete